ISRO – NRSC Recruitment | అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీ, జియోఇన్ఫర్మాటిక్స్, జియాలజీ, జియోఫిజిక్స్, సాయిల్ సైన్స్, అర్బన్ స్టడీస్, వాటర్ రిసోర్సెస్ తదితర విభాగాలలో సైంటిస్ట్/ఇంజినీర్ ఎస్సీ, నర్స్, మెడికల్ ఆఫీసర్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇస్రోకు చెందిన హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, గేట్/ నెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులును ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా ఫిబ్రవరి 12 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 41
పోస్టులు: సైంటిస్ట్/ఇంజినీర్ ఎస్సీ, నర్స్, మెడికల్ ఆఫీసర్, లైబ్రరీ అసిస్టెంట్
విభాగాలు: అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీ, జియోఇన్ఫర్మాటిక్స్, జియాలజీ, జియోఫిజిక్స్, సాయిల్ సైన్స్, అర్బన్ స్టడీస్, వాటర్ రిసోర్సెస్ తదితరాలు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 12
అడ్రస్: ఎన్ఆర్ఎస్సీ- ఎర్త్ స్టేషన్, షాద్నగర్ క్యాంపస్, రంగారెడ్డి జిల్లా లేదా ఎన్ఆర్ఎస్సీ, బాలానగర్, హైదరాబాద్.
వెబ్సైట్: nrsc.gov.in.