ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 21 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీఏ (సీబీసీఎస్), ఎంసీఏ (నాన్ సీబీసీఎస్) కోర్సుల మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు.
ఫలితాలను ఓయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు తమ మార్కు మెమోలను సంబంధిత కళాశాల నుంచి మూడు వారాల తరువాత నుంచి పొందవచ్చన్నారు. రివాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోదలిచిన వారు ఒక్కో పేపర్‌కు రూ.500 చొప్పున చెల్లించి ఈ నెల 26వ తేదీలోగా, రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 29వ తేదీ వరకు టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
జవాబు పత్రం నకలు పొందగోరేవారు ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున చెల్లించి ఈ నెల 26వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.