Inter Practicals | హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ప్రాక్టికల్స్‌కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుభవార్త చెప్పింది. నిర్ణీత తేదీల్లో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మళ్లీ రాసుకొనే అవకాశం కల్పించింది. గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ప్రత్యేకమైన పరిస్థితుల్లో అంటే.. అనారోగ్యం, వ్యక్తిగత అత్యవసర పరిస్థితుల్లో గైర్హాజరయ్యే వారికి మాత్రమే వెసులుబాటు కల్పించింది. కాగా, ఇంటర్ ప్రాక్టికల్స్‌ను ఈ నెల 7 నుంచి నాలుగు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడత 7న(శుక్రవారం), రెండో విడత 8 నుంచి 12 వరకు, మూడో విడత 13 నుంచి 17వరకు, నాలుగో విడత 18 నుంచి 22వరకు నిర్వహించనున్నారు.