1. జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాలకు సరిహద్దు గుండా ప్రవహిస్తున్న నది కింది వాటిలో ఏది?
ఎ) సెనెగల్ నది బి) అపోనది
సి) నైజర్ డి) కాంగోనది
2. ఐవరీ కోస్ట్ దేశ తీర ప్రాంతాన్ని కింది పేరుతో పిలుస్తారు?
ఎ) బానిసల తీరం బి) బంగారు తీరం
సి) ఎనుగు దంతాల తీరం
డి) మిరియాల తీరం
3. సియెర్రా నెవాడా, రాఖీ శ్రేణులకు మధ్య ఉన్న పరీవాహక ప్రాంతాన్ని కింది ఏ పేరుతో పిలుస్తారు?
ఎ) గ్రేట్ బేసిన్ బి) యుకాన్ ప్రాంతం
సి) ఫ్రేజర్ బేసిన్ డి) కోలరాడో బేసిన్
4. ఎర్రసముద్రానికి సమాంతరంగా నూబియన్, అబియన్ ఎడారుల మధ్య నుంచి ప్రవహిస్తూ మధ్యధరా సముద్రంలో కలుస్తున్న నది ఏది?
ఎ) నైజర్ నది బి) కాంగోనది
సి) ఆరెంజ్నది డి) నైలునది
5. నైలునది పైన ‘ఆశ్వాన్ డ్యామ్’ నిర్మాణం వల్ల ఏర్పడిన 479 కి.మీ. అతి పొడవైన మానవ నిర్మిత సరస్సును గుర్తించండి?
ఎ) కరీబా సరస్సు బి) నాసర్ సరస్సు
సి) వోల్టా సరస్సు డి) తానా సరస్సు
6. ఏడెన్ సింధుశాఖ, ఎర్రసముద్రం, హిందూ మహాసముద్రం మధ్యగల ప్రాంతాన్ని ‘ఆఫ్రికన్ కొమ్ము’ (Horn of Africa) అని పిలుస్తారు. దీనికి గల మరొక పేరు ఏమిటి?
ఎ) సినాతు ద్వీపకల్పం
బి) ఫ్లోరిడా ద్వీప కల్పం
సి) సెవార్ ద్వీపకల్పం
డి) సోమాలియా ద్వీపకల్పం
7. ప్రపంచంలోనే అతిపెద్ద పగులు లోయ ‘గొప్ప ఆఫ్రికన్ పగుల లోయ (The Great Africal Rift Valley) కింది సరస్సుల్లో దీని గుండా వెళ్లని సరస్సు ఏది?
ఎ) మాళవి సరస్సు బి) టుర్కాన్ సరస్సు
సి) తానా సరస్సు డి) విక్టోరియా సరస్సు
8. కింది ఏ ద్వీపం అట్లాంటిక్ మహా సముద్రంలో ఉంది?
ఎ) కెనరీ ద్వీపాలు బి) మడగాస్కర్ ద్వీపం
సి) పంబదీవి డి) జాంజిబార్ ద్వీపం
9. ఆరెంజ్నదిని ఎక్సోటిక్ నది అని పిలుస్తారు? (ఏదైనా నది ఎడారి గుండా ప్రవహిస్తే ఎక్సోటిక్ నది అని పిలుస్తారు) అయితే ఈ నది ఏ ఎడారి ప్రాంతం నుంచి ప్రవహిస్తుంది?
ఎ) కలహారి ఎడారి బి) సహారా ఎడారి
సి) అటకామా ఎడారి డి) అరేబియా ఎడారి
10. ‘కటంగాపీఠభూమి’ మధ్య ఆఫ్రికా ఖండంలో కలదు. ఇది కాంగో, జాంబియా, అంగోల దేశాల్లో విస్తరించి ఉంది. అయితే ఈ పీఠభూమిలో లభించని ఖనిజం ఏది?
1) రాగి ఖనిజం 2) వజ్రాలు
3) యురేనియం 4) బొగ్గు
ఎ) 1 తప్పు బి) 3 తప్పు
సి) 2 తప్పు డి) అన్నీ సరైనవి
11. జతపరచండి?
1) బాబర్ నేలలు ఎ) శివాలిక్ కొండల్లో పొడవుగా గులకరాళ్లతో ఏర్పడిన మైదాన ప్రాంతాలు
2) టెరాయి నేలలు బి) నదీ వరద మైదానాలకు దూరంగా పాత ఒండ్రు మట్టి
3) బంగర్ నేలలు సి) బాబర్‌కు దక్షిణంగా ఉండే చిత్తడి నేలల ప్రాంతం
4) ఖాదర్ నేలలు డి) నదీ తీరానికి దగ్గరలో ఉన్న వరద మైదానాలు
ఎ) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
బి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
12. బ్యాడ్‌ల్యాండ్ (ఉల్ఖాత భూమి) అని ఏ పీఠభూమిని పిలుస్తారు?
ఎ) దక్కన్ పీఠభూమి
బి) బుందేల్ ఖండ్ పీఠభూమి
సి) మాల్వా పీఠభూమి
డి) భాగల్ఖండ్ పీఠభూమి
13. ప్రతిపాదన (ఎ): దక్కన్ పీఠభూమి మధ్య భాగంలో వర్షపాతం తక్కువ కారణం (ఆర్): పర్వతానికి పవనాభిముఖ దిశలో వర్షపాతం తక్కువ
ఎ) ఎ, ఆర్ రెండూ సరైవవి, ఎ కి ఆర్ సరైన వివరణ
బి) ఎ, ఆర్ రెండూ సరైవవి, ఎ కి ఆర్ సరైన వివరణ కాదు
సి) ఎ ఒప్పు, ఆర్ తప్పు
డి) ఎ తప్పు కానీ ఆర్ ఒప్పు
14. భారతదేశంలో వర్షాభావ కరువుకు గల కారణాలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి?
1) దేశ వ్యాప్తంగా అల్ప పీడనాలు లేకపోవడం వల్ల బలహీన రుతుపవనాలు మరి సగటు కంటే తక్కువ వర్షపాతం
2) రుతుపవనాలు అలస్యం రావడం లేదా త్వరగా తిరోగమనం ప్రారంభం కావడం
3) రుతుపవనాల్లో దీర్ఘకాలిక అంతరాయాలు చోటు చేసుకోవడం
పై వాక్యాల్లో ఏది / ఏవి సత్యం?
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) అన్నీ సరైనవే
15. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి?
1) కశ్మీర్ లోయ హిమాద్రి, పిర్పంజల్ శ్రేణులకు మధ్యలో జమ్మూ కశ్మీర్లో ఉంది
2) కశ్మీర్ లోయ గుండా జీలం నది ప్రవహిస్తుంది
3) ఇక్కడే ఉలార్, దాల్ సరస్సులు కలవు
4) ఈ లోయలో ప్రముఖ పట్టణం శ్రీ నగర్ ఉంది
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 3, 4, 1 డి) అన్నీ సరైనవే
16. శివాలిక్ శ్రేణులను వివిధ రాష్ర్టాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిలో సరైన జత కానిదాన్ని గుర్తించండి?
ఎ) అసోం 1) కచార్ కొండలు
బి) పశ్చిమబెంగాల్ 2) డ్వార్ఫ్ కొండలు
సి) నేపాల్ 3) ఛూరియా కొండలు
డి) అరుణాచల్ ప్రదేశ్ 4) దుద్వా కొండలు
17. హిమాచల్ ప్రదేశ్, శివాలిక్ శ్రేణులకు మధ్య గల U ఆకారపు లోయలను డూన్స్ అని పిలుస్తారు. కింది డూన్స్లలో ఉత్తరాఖండ్‌లో లేని డూన్ ఏది?
ఎ) డెహ్రాడూన్ బి) కోట్లి డూన్
సి) పాట్లీడూన్ డి) చాఖండూన్
18. పూర్వాంచల్ హిమాలయాల్లో ఎత్తయిన శిఖరం సారామతి (3826 మీ), ఇది కింది ఏ కొండల్లో విస్తరించి ఉంది?
ఎ) నాగా కొండల్లో బి) పాట్కాయ్ కొండల్లో
స) మణిపూర్ కొండల్లో డి) మిజోకొండల్లో
19. కింది వాటిని జతపరచండి.
ఎ) గురు శిఖర శిఖరాగ్రం 1) లక్ష ద్వీపాలు
బి) దూదార్ జలపాతం 2) పశ్చిమ కనుమలు
సి) థాల్గాట్ కనుమ 3) నర్మదా నది
డి) ప్రవాళ బిత్తికలు 4) ఆరావళులు
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-3, బి-4, సి-1, డి-2
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-2, బి-3, సి-1, డి-4
20. భారతదేశ జనాభా లక్షణాలు.
1) పెద్ద పరిమాణం, నిరంతర వృద్ధి
2) గ్రామీణా జనాభా ప్రాబల్యం
3) వేగంగా తరుగుతున్న జనాభా ప్రాబల్యం
4) వేగంగా తరుగుతున్న జనాభా సాంద్రత
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 3
21. భారతదేశంలో కింది వాటిలో ఏ రాష్ర్టాల్లో అంతర్గత నది రవాణా ప్రముఖ స్థానం ఆక్రమించింది?
ఎ) కర్ణాటక, కేరళ, తెలంగాణ
బి) మిజోరం, మేఘాలయా, నాగాలాండ్
సి) కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు
డి) అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్
22. దక్షిణాసియాలో క్రియాశీలంగా ఉన్న ఏకైక అగ్నిపర్వతం ఉన్న బారెన్ దీవి భారతదేశంలో ఉంది. అది ఎక్కడ ఉంది?
ఎ) లక్షదీవులు
బి) అండమాన్ నికోబార్ దీవులు
సి) లడఖ్డ డి) జమ్మూ కశ్మీర్
23. కింది వాటిని జతపరచండి?
జలపాతాలు నది
ఎ) దూద్‌సాగర్ 1) నర్మద
బి) కపిల్ దార 2) మండోవి
సి) హొగెనెకల్ 3) కావేరి
డి) జోగ్ 4) శరావతి
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-2, బి-1, సి-3, డి-4
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-3, బి-4, సి-1, డి-2
24. జతపరచండి.
1) జమ్మూకశ్మీర్
ఎ) దువ్వానా, నిక్రి, పుష్కం సరస్సులు
2) రాజస్థాన్ బి) పాంకాంగ్, దాల్, సుమోరి సరస్సులు
3) మణిపూర్ – సి) క్రేటర్, లూనార్ సరస్సులు
4) మహారాష్ట్ర డి) లోక్తక్ సరస్సు
25. లక్షదీవులను పగడపు దీవులు (Coral Islands) అంటారు. వీటి విస్తీర్ణం ఎంత?
ఎ) 130 K.M.2 బి) 120 K.M.2
సి) 122 K.M.2 డి) 132 K.M.2
26. 2018 డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ అండమాన్ నికోబార్ దీవుల్లో 3 దీవుల పేర్లను మార్చారు. వీటిలో సరైనది కానిది ఏది?
దీవి కొత్తపేరు
ఎ) రాస్ దీవి 1) సుభాష్ చంద్రబోస్ దీవి
బి) హెవలాక్ దీవి 2) స్వరాజ్ దీవి
సి) నీల్ దీవి 3) షహీద్ దీవి
డి) సెంటిన్ దీవి 4) భగత్‌సింగ్ దీవి
27. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి?
1) అతి పెద్ద నేషనల్ పార్క్
ఎ) హెమిస్ నేషనల్ పార్క్ (లఢక్)
2) అతి చిన్న నేషనల్ పార్క్ – బి) సౌత్ బటన్ నేషనల్ పార్క్ (అండమాన్ నికోబార్)
3) రెండో అతి పెద్ద నేషనల్ పార్క్ సి) డెజర్ట్ నేషనల్ పార్క్ (రాజస్థాన్)
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 2, 3 డి) ఏదీకాదు
28. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
ఎ) ఘట ప్రభ ప్రాజెక్ట్ – కర్ణాటక
బి) తీస్తా ప్రాజెక్టు – హర్యానా
సి) రామ్‌గంగా ప్రాజెక్టు – ఉత్తర ప్రదేశ్
డి) తెహ్రీ ప్రాజెక్టు -ఉత్తరా ఖండ్
29. కింది నదుల్లో భారతదేశంలో ఆరంభం కాని నది ఏది?
ఎ) రావి బి) బియాస్
సి) సట్లెజ్ డి) చినాబ్
30. రాజస్థాన్‌తో సహా ఉత్తర భారతదేశ మైదానాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణాలను గుర్తించండి?
1) సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉండటం
2) సమతలమైన ప్రాంతం కావడం, ఈ ఉష్ణోగ్రతలు రుతు పవనాలు వచ్చే వరకు కొనసాగుతాయి
3) ఖండాంతర్గత ప్రాంతంలో ఉండటం
4) మేఘరహిత వాతావరణం ఉండటం
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 3, 4 డి) అన్నీ సరైనవే
31. ప్రతిపాదన (ఎ) : భారతదేశ ద్వీప కల్పంలో పడమర వైపు ప్రవహించే నదులకు డెల్టాలు లేవు..కారణం (ఆర్) ఈ నదులు ఎలాంటి ఒండ్రు అవక్షేపాలను మోసుకెళ్లవు.
సరైన సమాధానము
ఎ) ‘ఎ’, ‘ఆర్’ రెండూ నిజం, ‘ఆర్’, ‘ఎ’ కు సరైన వివరణ
బి) ‘ఎ’, ‘ఆర్’ రెండూ నిజం, ‘ఆర్’, ‘ఎ’ కు సరైన వివరణ కాదు
సి) ‘ఎ’ నిజం, ఆర్ తప్పు
డి) ‘ఎ’ తప్పు, ఆర్ నిజం
32. రుతుపవనాల క్రియాశీలతను ప్రభావితం చేసే అంశాల్లో సరికాని దాన్ని గుర్తించండి?
1) ఎల్‌నినో 2) లానినా
3) హిందూ మహాసముద్ర ద్వి ధ్రువ స్థితి
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) పైవన్నీ సరైనవే
33. కాఫీ ఉత్పత్తిలో ఇచ్చిన రాష్ర్టాలను వాటి ఉత్పత్తి ఆధారంగా ఆరోహణ క్రమంలో రాయండి?
ఎ) కేరళ > కర్ణాటక > అసోం
బి) కర్ణాటక > తమిళనాడు > కేరళ
సి) అసోం > తమిళనాడు > కేరళ
డి) కర్ణాటక > కేరళ > తమిళనాడు
– జీ గిరిధర్ సివిల్స్ ఫ్యాకల్టీ ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అశోక్‌నగర్, హైదరాబాద్ 9966330068