BTech | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బీటెక్ మేనేజ్మెంట్ కోటా ఫీజులను ఖరారు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. బీ-క్యాటగిరీ కోటా ఫీజులను కన్వీనర్ కోటా సీట్ల ఫీజుకు అదనంగా మూడు రెట్లు పెంచే అవకాశముంది. సాక్షాత్తు ప్రభుత్వమే అధికారింగా ఫీజులను పెంచనుంది. ఇందుకు మూడు ప్రతిపాదనలు రూపొందించిన ఉన్నత విద్యామండలి త్వరలోనే ప్రభుత్వం ముందుంచనుంది.
రాష్ట్రంలో బీటెక్ బీ-క్యాటగిరీ సీట్ల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయి. సీఎస్ఈ వంటి డిమాండ్ ఉన్న సీట్లను రూ. 14-16లక్షలకు అమ్ముకుంటున్న దాఖలాలున్నాయి. దీంతో బీ-క్యాటగిరీ సీట్లను ఆన్లైన్లో భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కొన్ని కాలేజీలు సైతం సుముఖత వ్యక్తంచేశాయి. కన్వీనర్యే ఈ సీట్లను భర్తీచేయనుండటంతో తొలుత ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉన్నత విద్యామండలి పలు ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
ఇవి ప్రతిపాదనలు..