శాతవాహనుల కాలం నాటి సమాజంలో ఏ వ్యవస్థ అమల్లో ఉండేది? 1) మాతృస్వామిక వ్యవస్థ 2) పితృస్వామిక వ్యవస్థ 3) రాచరిక వ్యవస్థ 4) ప్రజాస్వామ్య వ్యవస్థ
శాతవాహనుల కాలంలో ప్రజల భాష ప్రాకృతం కాగా రాజభాషగా వర్థిల్లింది ఏది? 1) తెలుగు 2) గ్రాంథికం 3) పైశాచీ 4) సంస్కృతం
కింది వాటిలో శాతవాహనుల రాజలాంఛనం ఏది? 1) వరాహం 2) సింహం 3) సూర్యుడు 4) కంఠకహారం
దేవాలయాల నిర్మాణంలో దక్కన్ శైలి ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది? 1) బాదామి చాళుక్యులు 2) విష్ణుకుండినులు 3) రాష్ట్రకూటులు 4) వాకాటకులు
వితంతువులకు భర్త ఆస్తి మీద హక్కు ఉన్న వాకాటకుల కాలంలో సతీసహగమనం ఏ వర్ణంలో మాత్రమే కనిపించేది? 1) బ్రాహ్మణులు 2) వైశ్యులు 3) క్షత్రియులు 4) శూద్రులు
శిల్పకళలో భాగంగా ఇక్ష్వాకుల కాలంలో ప్రారంభమైన విరుగల్ సంప్రదాయం అంటే? 1) చనిపోయిన సైనికుల విగ్రహాలు ప్రతిష్టించడం 2) రాజుల విగ్రహాలు ప్రతిష్టించడం 3) అమాత్యుల విగ్రహాలు ప్రతిష్టించడం 4) ఏదీకాదు
కందుక క్రీడ ఎవరి కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది? 1) శాతవాహనులు 2) ఇక్ష్వాకులు 3) విష్ణుకుండినులు 4) వాకాటకులు
‘రోమ్ దేశపు బంగారం మొత్తం భారత్‌కు తరలిపోతుందని’ అభిప్రాయపడిన విదేశీ చరిత్రకారుడు ఎవరు? 1) మెగస్తనీస్ 2) పెరిస్టా 3) ప్లీని 4) టాలమి
వీరపురుష దత్తుని అల్లూరి శాసనం ప్రకారం ఇక్షాకులు ఎవరి సామంతులు? 1) వాకాటకులు 2) రాష్ట్రకూటులు 3) విష్ణుకుండినులు 4) శాతవాహనులు
కులవ్యవస్థకు మూలకారణమైన వృత్తులు శాతవాహనుల సమాజంలో ఏమని పిలవబడ్డాయి? ఎ. శ్రేణులు బి. నికాయములు సి. సంఘాలు డి. కరణములు 1) ఎ, సి 2) బి, సి 3) ఎ, బి 4) సి, డి
దక్షిణ భారత చరిత్రలోనే మొట్టమొదటి సంస్కృత శాసనాన్ని నాగార్జునకొండపై వేయించినది? 1) శ్రీశాంతమూలుడు 2) ఎహూవల శాంతమూలుడు 3) వీరుపురుష దత్తుడు 4) వాశిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు
గధాయుద్ధం కావ్యం, కాథేం శాసనం ప్రకారం కల్యాణి చాళుక్యులు ఏ వంశానికి చెందినవారు? 1) బాదామి చాళుక్యులు 2) వేములవాడ చాళుక్యులు 3) తూర్పు చాళుక్యులు 4) ముదిగొండ చాళుక్యులు
పేరూరు శాసనం ప్రకారం కందూరు చోడుల కాలంలో వర్తక సంఘాలను ఏమని పిలిచారు? ఎ. అరవనకరం బి. నికాయములు సి. శ్రేణులు డి. తెలుగు సకరాలు 1) ఎ, బి 2) బి, సి 3) సి, డి 4) ఎ, డి
తెలుగు భాషకు తొలిసారిగా అధికార భాషా ప్రపత్తిని కల్పించి అభివృద్ధి చేసిన ఘనత ఏ రాజవంశీయులకు దక్కుతుంది? 1) కాకతీయులు 2) తూర్పు చాళుక్యులు 3) వేములవాడ చాళుక్యులు 4) రాష్ట్రకూటులు
దేవతా విగ్రహాలు, ఆయుధాలు, వంట పాత్రలు తయారు చేసేవారిని రేచర్ల పద్మనాయకుల కాలంలో ఏమని పిలిచారు? 1) పంచాణం 2) తలారి 3) కమ్మరి 4) కరణం
సంస్కృత భాషను ఎక్కువగా ఆదరించిన రేచర్ల పద్మనాయకుల కాలంలో ప్రాచుర్యంలో గల నృత్యాలు? 1) భరతనాట్యం, పారశీకమత్తల్లి 2) జక్కిని, పేరిణి 3) చెంచు, గోండి 4) పైవన్నీ
ద్రవ్య వ్యవస్థను పటిష్టపర్చిన రాజవంశీయులు? 1) శాతవాహనులు 2) వాకాటకులు 3) తూర్పు చాళుక్యులు 4) రాష్ట్రకూటులు
ఉక్కు, కాగితం, గాజు, అద్దం ఏ రాజవంశీయుల కాలంలో వాడుకలోకి వచ్చాయి? 1) కాకతీయులు 2) రాష్ట్రకూటులు 3) రేచర్ల పద్మనాయకులు 4) తూర్పు చాళుక్యులు
దేశంలో మొట్టమొదటి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాజవంశీయులు? 1) కాకతీయులు 2) ఇక్ష్వాకులు 3) కుతుబ్‌షాహీలు 4) అసఫ్జాహీలు
జోగిని, దేవదాసి గురించి తెలిపే పురాతన శాసనం? 1) జోగిమర శాసనం 2) జోగుల్తంబి శాసనం 3) ఉజ్జయిని శాసనం 4) గిర్నార్ శాసనం
కాగులు అంటే? 1) ధాన్యం నిల్వ చేసుకునే పెద్ద కుండ 2) నీటిని నిల్వ చేసుకునే పెద్ద కుండ 3) పెళ్లిల్లలో వాడే ఐరేని కుండ 4) వ్రతాల్లో వాడే నోము కుండ
ఆకాశదర్పణం అనే అర్థం వచ్చే నిజాం పాలకుల నాటి భవన నిర్మాణం? 1) ఫలక్‌నుమా 2) చౌమహల్లా 3) ఎర్రమంజిల్ 4) పురానాహవేలి
నిజాం నాటి నిర్మాణాల్లో ఏ భవన నిర్మాణానికి ‘రామ్-రహీమ్’ అని రాసి ఉంటుంది? 1) రాజ్‌భవన్ 2) బ్రిటిష్ రెసిడెన్సీ 3) ఫలక్‌నుమా ప్యాలెస్ 4) హైకోర్టు
నిజాం కాలంలో నిర్మించిన ఆర్ట్స్ కాలేజీ భవన రూపశిల్పి? 1) సర్ పాట్రిక్ గెడ్డెస్ 2) అలీయావర్ జంగ్ 3) మీర్ మహ్మద్ బదారి 4) లాయక్ అలీ
సిటీ కాలేజీ నిర్మాణం ఎవరి హయాంలో జరిగింది? 1) మీర్ మహబూబ్ అలీఖాన్ 2) మీర్ ఉస్మాన్ అలీఖాన్ 3) నిజాం-ఉల్-ముల్క్ 4) అఫ్జలుద్దౌలా