న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ టెక్నీషియన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 11 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1625 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదిక నింపుతున్నది.
మొత్తం పోస్టులు: 1625
ఇందులో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 814, ఎలక్ట్రీషియన్ 184, ఫిట్టర్ 627 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్లో రెండేండ్ల ఐటీఐ ఉత్తీర్ణులవాల్సి ఉంది. చదువు ముగిసిన తర్వాత ఏడాది అనుభవం తప్పనిసరి. 30 ఏండ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 11
వెబ్సైట్: www.ecil.co.in