హైదరాబాద్: ఎంసెట్లో మిగిలిన అగ్రికల్చర్, మెడికల్ (ఏఎం) ప్రవేశ పరీక్షలు శని, ఆదివారాల్లో జరుగనున్నాయి. రెండు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తారు. శని, ఆదివారాల్లో మొదటి సెషన్ ఉదయం 9 ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల ముగుస్తుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 94 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం తెలంగాణలో 68, ఆంధ్రప్రదేశ్లో 18 చొప్పున పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించారు. కాగా, ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ నేడు విడుదల కానుంది.