Osmania University | ఓయూలో వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు చెప్పారు
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీఏ (రెండేళ్ల కోర్సు) మొదటి, మూడో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ లో బ్యాక్లాగ్, బీఎస్ – ఎంఎస్ (కంప్యూటర్ సైన్స్ – ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం) మొదటి, మూడు, అయిదు, ఏదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ లో చూసుకోవాలని సూచించారు.
విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో జూనియర్, సీనియర్ డిప్లమా అభ్యర్థులు తమ పరీక్షా ఫీజును వచ్చే నెల 5వ తేదీ లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు. రూ.300 అపరాధ రుసుముతో పదో తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు.
ఈ పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

