ఉస్మానియా యూనివర్సిటీ, మే 17: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన డిగ్రీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీఎస్‌డబ్ల్యూ (ఇయర్వైజ్ స్కీమ్) కోర్సుల బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 25వ తేదీ నుంచి, ఓయూ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ) ద్వారా అందించే బీఏ, బీకామ్, బీబీఏ కోర్సుల రెగ్యులర్, బ్యాక్లాగ్ డిగ్రీ కోర్సుల పరీక్షలను ఈ నెల 26వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని ఆయన తెలిపారు.