1. అగ్ని క్షిపణి.. ఇది మధ్యస్థ దూరాల నుంచి ఖండాంతరాలను ఛేదించ గలదు. దీన్ని హైదరాబాద్లోని డీఆర్డీవో అభివృద్ధి చేసింది. అగ్ని క్షిపణికి సంబంధించి సరిగా జతపర్చండి?
క్షిపణి రేంజ్
ఎ. అగ్ని -1 I. 2000-
3000 కి.మీ
బి. అగ్ని -2 II. 700-
1250 కి.మీ
సి. అగ్ని-3 III. 3,500-
5000 కి.మీ
డి. అగ్ని- 4 IV. 3000-
4000 కి.మీ
ఇ. అగ్ని-5 V. 5000-
8000 కి.మీ
జవాబు: ఎ-II, బి-I, సి-III,
డి-IV, ఇ- V
2. ఎంఐఆర్వీ టెక్నాలజీ అంటే ?
1) మల్టిపుల్ ఇండిపెండెంట్లీ
టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్
టెక్నాలజీ
2) మల్టిపుల్ ఇన్స్టిట్యూషనల్
టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్
టెక్నాలజీ
3) మల్టిడైమెన్షనల్ ఇండిపెండెంట్లీ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ
4) పైవేవీ కాదు
జవాబు: 1
3. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (ప్రపంచ వాణిజ్య సంస్థ) ఎప్పటి నుంచి చట్ట బద్ధమైన సంస్థగా ఆవిర్భవించింది?
1) 1995, జనవరి 1
2) 1994, ఫిబ్రవరి 1
3) 1994, జనవరి 1
4) 1995, ఫిబ్రవరి 1
జవాబు: 1
4. దేశంలో తొలి ప్రభుత్వ రంగ ‘ఓటీటీ సర్వీసెస్’ ఎక్కడ ప్రారంభమైంది? దాని పేరు?
1) సీస్పేస్, తమిళనాడు
2) సీస్పేస్, కేరళ
3) ఐస్పేస్, ఢిల్లీ
4) బీస్పేస్, ముంబై జవాబు: 2
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ, హైదరాబాద్
సౌజన్యంతో…