హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ – పీజీ ఫలితాలు విడుదలయ్యాయి.
మార్చి 6 నుంచి 27 వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు వెబ్సైట్లో పొందుపరిచి స్కోర్‌కార్డులను విడుదల చేసింది.