CBSC Exams | ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను 10, 12వ తరగతులకు సంబంధించిన పరీక్ష తేదీలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకటించింది. 2025 ఫిబ్రవరి 15 నుంచి 12వ తరగతి, టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. క్లాస్ 12 మొదటి పేపర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ పేపర్‌తో పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 18 వరకు 10వ తరగతి, ఏప్రిల్ 4 వరకు 12వ తరగతి పరీక్షలు కొనసాగుతాయి. ఈ మేరకు డేట్‌షీట్ విడుదల చేసింది. పరీక్షలకు 86 రోజుల ముందుగానే ఎగ్జామ్ డేట్లను ప్రకటించడం ఇదే మొదటి సారి. కాగా, గత కొన్నేండ్లుగా వస్తున్న సంప్రదాయానికి స్వస్తి పలికి సీబీఎస్సీ.. ఈసారి ప్రధాన సబ్జెక్టులకు ముందుగా పరీక్షలు నిర్వహించనుంది.
ఒక విద్యార్థికి సంబంధించిన రెండు సబ్జెక్టుల పరీక్షలు ఒకే తేదీన జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సీబీఎస్సీ తెలిపింది. ఉదయం 10.30 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల ప్రారంభానికి 86 రోజుల ముందు తొలిసారిగా డేట్ షీట్‌ను విడుదల చేశామని, పాఠశాలలు సకాలంలో LOCని సమర్పించడం వల్ల ఇది సాధ్యమైందని అధికారులు అన్నారు.
న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతుల పరీక్షా విధానంలో మార్పులు, సిలబస్ తగ్గింపు గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఖండించింది. సిలబస్‌ను 15 శాతం వరకు తగ్గిస్తున్నారని, 10, 12 తరగతుల పరీక్షలను 2025లో ఓపెన్ బుక్ విధానంలో నిర్వహిస్తారంటూ వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని, వాటిని నమ్మొద్దని సీబీఎస్ఈ తెలిపింది. ఆన్లైన్లో వచ్చే పోస్టులను నమ్మొద్దని విద్యార్థులను కోరింది. సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌లోని సమాచారంపై మాత్రమే ఆధారపడాలని సూచించింది.