BEL | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఇంజినీర్ (Probationary Engineer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా 340 పోస్టులను భర్తీ చేస్తున్నది. బీఈ, బీటెక్ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహరాష్ట్ర, హర్యానా, ఉత్తరాఖండ్‌లో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.
మొత్తం పోస్టులు: 340
విభాగాల వారీగా.. ఎలక్ట్రానిక్స్ 175, కంప్యూటర్ సైన్స్ 42, మెకానికల్-109, ఎలక్ట్రికల్ 14 పోస్టులు ఉన్నాయి. వీటిలో ఈడబ్ల్యూఎస్‌కు 34, అన్‌రిజర్వుడ్ 139, ఓబీసీ-ఎన్సీఎల్ 91, ఎస్సీ 51, ఎస్టీ 25 చొప్పున కేటాయించారు.
అర్హతలు: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్‌తో బీఈ లేదా బీటెక్ 60 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
వయసు: 2025, అక్టోబర్ 1 నాటికి 25 ఏండ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏండ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్‌కు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
పరీక్ష విధానం: మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్, హిందీల్లో అడుగుతారు. 120 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి. టెక్నికల్ ప్రశ్నలు 100, రీజనింగ్, జనరల్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు 25 వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. ఈ ఎగ్జామ్‌లో జనరల్ వర్గాలవారు 35 శాతం, ప్రత్యేక వర్గాలకు చెందినవారు 30 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. వీరిని 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. సీబీటీకి 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
వేతనం: నెలకు రూ.40 వేల నుంచి రూ.1.4 లక్షల వరకు
దరఖాస్తు ఫీజు: రూ.1180, ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: నంబర్ 14
వెబ్సైట్: www.bel-india.in