Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ విభాగంలో బాణాల వెంకటయ్య డాక్టరేట్ సాధించారు. విభాగం హెడ్ ప్రొఫెసర్ గంగాధర్ పర్యవేక్షణలో ”కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ టువర్డ్స్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్: ఎ స్టడీ విత్ రిఫరెన్స్ టు ఈ-మార్కెటింగ్ పోర్టల్ ఇన్ ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్”అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి వెంకటయ్య సమర్పించిన పరిశోధనా గ్రంధాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు ఆయనకు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.
నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రానికి చెందిన బాణాల ఉపేంద్రమ్మ, యాదయ్యల ప్రథమ సంతానమైన వెంకటయ్య చిన్నతనంలోనే పోలియో వ్యాధి బారిన పడ్డాడు. ఒకవైపు పేదరికం, మరొకవైపు వైకల్యం ఉన్నా తల్లిదండ్రులు ఉన్నత విద్యలు చదివించారు. వెంకటయ్య బాల్యం నుంచి ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతూ, చదువులో రాణిస్తూ వైకల్యాన్ని లెక్కచేయకుండా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ పూర్తిచేసి, పీహెచ్డీ సైతం పూర్తి చేశాడు. తెలంగాణ సెట్, యూజీసీ నెట్ పరీక్షలలో అర్హత సాధించాడు. బాణాల వెంకటయ్య తెలంగాణ ఉద్యమం, దివ్యాంగుల హక్కుల సాధనలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా ఆయనను కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు.