ఉస్మానియా యూనివర్సిటీ, మే 8: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ (ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని ప్రొఫెసర్ నగేశ్ తెలిపారు.