ఎవర్గ్రీన్ కెరీర్లో డిజైనింగ్ రంగం ఒకటి. దీనిలో అనేక రకాలు ఉన్నాయి. అయితే నిత్యనూతనంగా ఉండే పాదరక్షలు, లెదర్ యాక్ససరీస్, లైఫ్‌ైస్టెల్ వస్తువుల డిజైనింగ్ కూడా చక్కటి ఉపాధి అవకాశాలను అందిస్తుంది. రోజురోజుకు విస్తరిస్తున్న ఈ రంగంలో నిపుణుల కొరతను తీర్చడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఎఫ్‌డీడీఐ. ఇది యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సులను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 12 ఎఫ్డీడీఐల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా….
ఎఫ్‌డీడీఐ
ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్.ఈ సంస్థను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ 1986లో ఏర్పాటు చేసింది. ఎఫ్‌డీడీఐ భారత పరిశ్రమకు సహాయపడుతూ పాదరక్షల తయారీ, తోలు ఉపకరణాలు & జీవనశైలి ఉత్పత్తుల రంగాల్లో నైపుణ్య లోటును పూరిస్త్తుంది. 2017లో అమల్లోకి వచ్చిన ఎఫ్‌డీడీఐ చట్టం ప్రకారం ‘జాతీయ ప్రాముఖ్యత గల సంస్థ‘ గా గుర్తింపు పొందింది. ఈ సంస్థ పాదరక్షల ఉత్పత్తి, తోలు ఉత్పత్తులు, రిటైల్ & ఫ్యాషన్ వ్యాపార నిర్వహణ, ఫ్యాషన్ డిజైన్ రంగాల అభివృద్ధికి అంకితమైన ప్రముఖ విద్యా, శిక్షణా సంస్థ.
ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌లు
నోయిడా, ప్రుస్త్గంజ్, చెన్నై, కోల్‌కతా, రోహతక్, చింద్వారా, గుణ, జోధ్‌పూర్, అంకలేశ్వర్, బానూర్, పాట్నా, హైదరాబాద్.
యూజీ కోర్సులు
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీ డిజైన్)- నాలుగేండ్లు – 8 సెమిస్టర్లు
బీ డిజైన్ (ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్), బీ డిజైన్ (ఫ్యాషన్ డిజైన్)
బీ డిజైన్ (లెదర్, లైఫ్‌ైస్టెల్ అండ్ ప్రొడక్ట్ డిజైన్)
బీబీఏ (రిటైల్ అండ్ ఫ్యాషనల్ మర్చండైజ్)
పీజీ కోర్సులు
రెండు సంవత్సరాలు –
నాలుగు సెమిస్టర్లు
ఎం.డిజైన్ (ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్), ఎం.డిజైన్
(ఫ్యాషనల్ డిజైన్)
ఎంబీఏ (రిటైల్
అండ్ ఫ్యాషన్ మర్చండైజ్)
పీహెచ్డీ ప్రోగ్రామ్స్
ప్లేస్‌మెంట్స్
అడిడాస్, బాటా, మ్యాక్స్, స్కెచర్స్, స్నాప్‌డీల్, విశాల్, అప్పెరల్, లైఫ్‌ైస్టెల్, ఖాదీమ్స్, మిర్జా, పూమా, లిబర్టీ, రిలయన్స్, వీకేసీ, పిడిలైట్, టాటా ఇంటర్నేషనల్, యాక్షన్, రీబాక్ తదితరాలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు
వచ్చే ప్రముఖ సంస్థలు.
అర్హతలు
డిగ్రీ కోర్సులకు ఇంటర్ ఉత్తీర్ణత,
పీజీ కోర్సులకు డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు: డిగ్రీ కోర్సులకు 25 ఏండ్లు మించరాదు. పీజీ కోర్సులకు
వయోపరిమితి లేదు
ఎంపిక విధానం
దేశవ్యాప్తంగా నిర్వహించే ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్ (ఏఐఎస్‌టీ)-2025 ద్వారా
డిగ్రీ ప్రోగ్రామ్స్‌కు జరిగే పరీక్షలో అన
లిటికల్ ఎబిలిటీ, బిజినెస్ ఆప్టిట్యూడ్, డిజైన్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, కాంప్రహెన్షన్,
గ్రామర్, యూసేజ్
తదితరాలపై ప్రశ్నలు ఇస్తారు.
దేశవ్యాప్తంగా 12
క్యాంపస్‌లలో
ఉన్న సీట్ల సంఖ్య – 2390
ముఖ్య తేదీలు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఏప్రిల్ 20
ఎంట్రన్స్ తేదీ : మే 11
వెబ్సైట్ :
www.fddiindia.com
after inter demand full course is footwear designing