
సింగపూర్, సౌత్ ఈస్ట్ ఆసియాలో సుమారు 60 లక్షల జనాభా ఉన్న ఒక ద్వీపం. ఏరియా ప్రకారం ప్రపంచ దేశాల్లో 190వ స్థానంలో ఉంది. కానీ ఆ దేశ 2020 జీడీపీ ర్యాంక్ 38. సింగపూర్ బాగా అభివృద్ధి చెందిన దేశం. అక్కడ అవినీతి చాలా తక్కువ. ఫైనాన్షియల్ అండ్ షిప్పింగ్ హబ్‌గా సింగపూర్ అభివృద్ధి చెందింది. సంస్కృత పేరు అయిన సింహపుర నుంచి వచ్చింది. అది కాస్తా సింగపుర తరువాత సింగపూర్ అయ్యింది. వివిధ సంస్కృతులు, విభిన్న భాషలు గల దేశం ఇది. ఆంగ్ల భాషతో పాటు చైనీస్, మలే వంటి వివిధ భాషలు వాడుకలో ఉన్నాయి.
ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసే గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో సింగపూర్ టాప్ 10 సురక్షితమైన దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. అక్కడి ప్రభుత్వం స్థిరంగా ఉండటం, సమర్థవంతమైన పోలీస్, న్యాయవ్యవస్థ ఉండటం వల్ల అక్కడ క్రైమ్ రేట్ తక్కువ. విదేశీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన లేకుండా సింగపూర్ వైపు ఆసక్తి చూపుతున్నారు. గ్యాలప్ వరల్డ్ పోల్ ప్రకారం సింగపూర్‌లో 94% మంది రాత్రివేళ ధైర్యంగా ఒంటరిగా వెళ్లగలమన్నారు. అదే ప్రపంచంలో 64% మంది మాత్రమే అనగలిగారు.
ప్రపంచంలోని అతిపెద్ద మానవ వనరుల నిర్వహణ కన్సల్టింగ్ ఏజెన్సీ అయిన మెర్సెర్, 2021లో క్వాలిటీ అఫ్ లివింగ్ ర్యాంకింగ్ ఆసియా పసిఫిక్ సర్వే ప్రకారం సింగపూర్ ఆసియాలో అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన నగరాల్లో ఒకటి. చక్కటి నగర ప్రణాళిక, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ, సౌకర్యవంతమైన రవాణా, వెచ్చని వాతావరణం, సహనంతో కూడిన, స్నేహపూర్వక సామాజిక వాతావరణంతో పాటు వివిధ దేశాలకు విమాన ప్రయాణం దగ్గరలో ఉండటం వల్ల సింగపూర్ అన్ని వర్గాల ప్రజలకు అనువైన అధ్యయన గమ్య స్థానంగా మారింది.
2012లో విడుదలైన అర్బన్ ప్లానింగ్ సర్వే ప్రకారం సుమారు 47% ఏరియా చెట్లతో ఉంది. 2030 వరకు ప్రతి ఇంటికి 10 నిమిషాల దూరంలో పార్కు ఉండేలా ప్రయత్నిస్తుంది. వందలాది ఉద్యానవనాలు, నేచర్ రిజర్వ్స్, అడవులు, పగడపు దీవులు ఉన్నాయి. సింగపూర్ బొటానికల్ గార్డెన్స్ ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్. అలాగే అక్కడి గార్డెన్స్ బై ది బే చాలా ఫేమస్.
సింగపూర్ విద్యావ్యవస్థ ప్రపంచంలోనే గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే ఉత్తమమైన యూనివర్సిటీలు ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత సింగపూర్ గొప్ప ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందింది. ఏరోస్పేస్, ప్రెసిషన్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, క్రియేటివ్ పరిశ్రమ, వృత్తిపరమైన సేవలకు సంబంధించిన అనేక కంపెనీలు ఉన్నాయి. ఆసియాలోని సుమారు 46% కంపెనీల హెడ్‌క్వార్టర్స్ సింగపూర్‌లో ఉన్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ కాంపిటీటివ్ ర్యాంక్‌లో 2వ స్థానంలో ఉంది. గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్ ర్యాంక్ 2, గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంక్ 5. యూనివర్సిటీలు, కంపెనీలకు మధ్య మంచి రిలేషన్స్ ఉండటం వల్ల రిసెర్చ్ ఇతర అవకాశాలు లభిస్తాయి.
సింగపూర్ నుంచి ప్రపంచంలోని సుమారు 400 సిటీస్‌కి ఫ్లయిట్ కనెక్టివిటీ ఉంది.
సింగపూర్‌లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువే అనిపించినా లండన్‌లో రెంట్ కన్నా తక్కువ. సింగపూర్ ESI ర్యాంకింగ్స్‌లో, గ్లోబల్ స్మార్ట్ సిటీ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉంది.
ఒక సింగపూర్ డాలర్ 55.59 ఇండియన్ రూపాయలకు సమానం. నివాస ఖర్చులు సుమారు 800 సింగపూర్ డాలర్లు ఉంటుంది. సెంట్రల్ రీజియన్‌లో రెంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నార్త్ అండ్ ఈస్ట్ రీజియన్‌లో కొంచెం తక్కువ.
ప్రముఖ ప్రాంతాలు
ఆర్చర్డ్: సింగపూర్ సెంట్రల్ రీజియన్‌లో ఉన్న ఈ ప్రదేశం షాపింగ్ అండ్ రిటైల్‌కి చాలా ఫేమస్. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్‌తో ఉంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఈ నగరం పై ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వారికి పార్ట్ టైం ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే అయినా, ఎక్కువ బిజీ లైఫ్ ఉన్నా ప్రశాంతమైన నివాస ప్రదేశాలు ఉన్నాయి. లండన్ స్కూల్ అఫ్ కామర్స్, అమెరికన్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్, అవెంటీస్ స్కూల్ వంటి అనేక కళాశాలలు ఉన్నాయి.
బుకిత్ తిమాహ్: అందమైన ప్రకృతి దృశ్యాలు గల ఈ ప్రదేశం మంచి లైఫ్ ైస్టెల్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్‌తో విద్యార్థులను ఆకర్షిస్తుంది. నేచురల్ రిజర్వ్, రెయిన్ ఫారెస్ట్ రిజర్వ్ ఉన్నాయి. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కి ఇక్కడ ఒక క్యాంపస్ ఉంది.
టియాంగ్ బరు: ఇక్కడ సింగపూర్‌లోని ఓల్డెస్ట్ హౌసింగ్ ఉంది. సిటీ సెంటర్‌కి దూరం అనిపించినా ఇక్కడ కమర్షియల్ లొకేషన్ ఉంది. సింగపూర్‌లో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వల్ల ఎక్కడికయినా త్వరగా వెళ్లవచ్చు. సిటీ రష్‌కి దూరంగా ఇక్కడ ఉండవచ్చు. డ్యూక్ (ఎన్‌యూఎస్) ఇక్కడ ఆస్పత్రి ఉండటం వల్ల ఈ ప్రాంతంపై మెడికల్ స్కూల్ విద్యార్థులు ఆసక్తి ఎక్కువగా చూపుతారు.
డోవర్ క్వీన్స్టౌన్ జిల్లాకు చెందిన ఒక సాధారణ సబ్ జోన్, గిమ్ మోహ్కు దక్షిణాన, కెంట్ రిడ్జ్కు ఉత్తరాన ఉంది.
సెంటోసా: రిసార్ట్స్ గల అందమైన ఐలాండ్. ఇక్కడ కాస్ట్ అఫ్ లివింగ్ ఎక్కువ. అందమైన ప్రదేశాలతో పాటు రిచ్ ఫెసిలిటీస్ గల ప్రదేశంలో ఉండాలనుకునే వారు ఇక్కడ ఉండవచ్చు.
క్లెమెంటీ: ఆర్చర్డ్, సెంటోసాలతో పోలిస్తే కాస్ట్ అఫ్ లివింగ్ తక్కువ. ఎంఆర్టీ స్టేషన్ నుంచి డోవర్, జురాంగ్లో చదువుకోవాలనుకునే వారు ఇక్కడి నుంచి ట్రావెల్ చేయవచ్చు. ఇక్కడి కమ్యూనిటీ లైఫ్ బాగుంటుంది. స్పోర్ట్ యాక్టివిటీస్ బాగుంటాయి.
కెంట్ రిడ్జ్: క్వీన్స్ టౌన్లో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ కెంట్ రిడ్జ్ పార్క్, హార్ట్ పార్క్ చాలా ఫేమస్. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఇక్కడే ఉంది.
తాన్ జోంగ్ పాగార్: ఇది ఎంతో చరిత్ర గలది. ఇక్కడ మలే హెరిటేజ్ కనిపిస్తుంది. ట్రేడర్స్, వర్కర్స్ ఇష్టపడిన చోటు. సింగపూర్ గవర్నమెంట్ చేపట్టిన కన్జర్వేషన్ ప్రాజెక్ట్ తరువాత ఇది ఒక ఫ్యాషన్ డిస్ట్రిక్ట్‌గా మారింది.
నోవెన: ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీ సింగపూర్ క్యాంపస్ ఇక్కడ ఉంది. అలాగే టాన్ టాక్ సెంగ్ హాస్పిటల్ ఉంది.
సింగపూర్ ఆగ్నేయాసియాలోని చాలా చిన్న, భారీగా పట్టణీకరణ గల ద్వీప నగర రాష్ట్రం. మలేషియా, ఇండోనేషియా మధ్య మలయన్ ద్వీపకల్పం చివర ఉంది. సింగపూర్ మొత్తం భూభాగం 724.2 చదరపు కిలోమీటర్లు. కాబట్టి సింగపూర్‌లో విద్యార్థులు ఒక చోట నివసించినా ఇంకో చోట చదువుకోవచ్చు. ఎందుకంటే అక్కడి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఈ దూరాన్ని తగ్గిస్తాయి.
టాప్ యూనివర్సిటీలు
బోధన ఆంగ్లంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ చదవానుకునేవారు తమకు ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్నదని నిరూపించుకోవాలి.
నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (NUS), నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (NTU) వరుసగా గ్లోబల్ ర్యాంకింగ్స్ లో 11, 12 స్థానాల్లో ఉన్నాయి. సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ కూడా టాప్ 550లో ఉంది.
నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్: (https://www.nus.edu.sg/admissions) సుమారు 75-100 దేశాల నుంచి 38,000 పైగా విద్యార్థులు ఇక్కడ చదువుతుంటారు. ఇక్కడ చదివిన వారు సుమారు 64 దేశాల్లో పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, లా, బిజినెస్, డిజైన్, సోషల్ సైన్సెస్ వంటి అనేక రంగాల్లో కోర్సులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ రికార్డు, ఎగ్జామ్ స్కోర్ అడ్మిషన్ కోసం చూస్తారు. లేకపోతే ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్ష అయిన TOEFL/ IELTS అవసరం. స్కాలర్షిప్ అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ ట్యూషన్ అండర్ గ్రాడ్యుయేట్ వారికి సంవత్సరానికి సుమారు 17,000 సింగపూర్ డాలర్లు ఉంటుంది. ప్రోగ్రాంని బట్టి ఫీజు ఉంటుంది. మెడిసిన్, డెంటిస్ట్రీ, మ్యూజిక్, లా కోర్సుల ఫీజు ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ సబ్సిడీకి ఎలిజిబిలిటీ అయితే ఫీజు తక్కువగా ఉంటుంది. లేదంటే సంవత్సరానికి కనీసం 38,000 సింగపూర్ డాలర్లు ఫీజు ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్‌కి SAT/ACT స్కోర్స్ అవసరమవుతాయి. కెంట్ రిడ్జ్, బుకిత్ తిమాహ్, ఔత్రం లో క్యాంపస్‌లు ఉన్నాయి.
నాన్యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ: (https://www.ntu.edu.sg/)
సుమారు 30 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఇంజినీరింగ్, మెడిసిన్, బిజినెస్, హ్యుమానిటీస్, ఆర్ట్స్, సోషల్ సైన్సెస్, కాలేజీ అఫ్ ఎడ్యుకేషన్, డిఫెన్స్ స్టడీస్ వంటి అనేక కోర్సులు ఉన్నాయి. GRE స్కోర్స్ అడ్మిషన్స్ కోసం అవసరం. భారతీయ విద్యార్థులు గేట్ (GATE)లో 90 పర్సంటైల్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. TOEFL/IELTS అవసరమైతే సబ్మిట్ చెయ్యాలి లేదా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లిష్ అని ప్రూఫ్స్ సబమిట్ చెయ్యాలి. టోటల్ ప్రోగ్రాం ఫీ కనీసం 40,000 సింగపూర్ డాలర్లు ఉంటుంది. కోర్స్ అండ్ సబ్జెక్టుని బట్టి మారుతుంది. కాబట్టి జాగ్రత్తగా వెబ్సైట్లో చూడండి.
సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ: (https://www.smu.edu.sg/)
ఈ అటానమస్ యూనివర్సిటీ 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. సుమారు 9000 మంది విద్యార్థులు ఉంటారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల తర్వాత అడ్మిషన్స్ ఓపెన్ అవుతాయి. చేసే కోర్సులను బట్టి డెడ్‌లైన్ ఉంటుంది. సాధారణంగా రెండు ఇన్టేక్స్ ఉంటాయి. ఇన్‌టేక్‌ని బట్టి ప్లాన్ చేసుకోండి.
అడ్మిషన్ లెటర్ వచ్చిన తరువాత స్టూడెంట్ పాస్ కోసం అప్లయ్ చేసుకోవాలి (www.ica.gov.sg). కనీసం 10 రోజులు పడుతుంది. కోర్స్ స్టార్ట్ అవడానికి 1 నుంచి 2 నెలల మధ్య సమయంలో దీనికి అప్లయ్ చేసుకోవచ్చు.
విదేశీ విద్య కావాలి. కానీ పిల్లలను దూరంగా పంపించాలంటే చింతించే వారికి సింగపూర్ కేవలం 6 నుంచి 8 గంటల దూరంలో ఉంటుంది. కాబట్టి సింగపూర్‌లో అవకాశాల గురించి ఆలోచించవచ్చు.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT