
ప్రపంచం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అవకాశాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ఆయా రంగాల్లో నిపుణుల అవసరం రోజురోజుకి పెరుగుతుంది. రోజుకో కొత్తదనం కోసం ఎదురుచూసే ఈ నవీన ప్రపంచానికి క్రియేటివిటీతో కొత్తదనాన్ని అందించే నిపుణులు అవసరం పెరుగుతుంది. నిత్యం మనం వాడే ప్రతి వస్తువును ఎప్పటికప్పుడు కొత్తగా రూపొందించే వారి కోసం ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. సరిగ్గా ఇలాంటి వారినే తయారుచేయాలనే సంకల్పంతో విక్రమ్ సారాభాయ్ కుంటుంబం ప్రారంభించిన విద్యాసంస్థ ఎన్ఐడీ. నేడు ఆ సంస్థ జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థగా ఎదిగి, ఎందరో నిష్ణాతులను దేశానికి అందిస్తుంది. ఎన్ఐడీలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు..
ఎన్ఐడీ నేపథ్యం
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరుణంలో జరిగిన మేధోమదనం సందర్భంగా.. 1957లో భారత ప్రభుత్వం దేశంలో పారిశ్రామికీకరణకు తోడ్పడే సూచనలు, సలహాలు ఇవ్వమని ఫోర్డ్ ఫౌండేషన్‌ను ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఆయా రంగాలకు చెందిన వేలాదిమందిని కలిసిన ఫోర్డ్ ఫౌండేషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికల ఆధారంగా సారాభాయ్ కుంటుంబం అహ్మదాబాద్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైన్‌ను 1961లో ప్రారంభించింది. మొదట దీన్ని స్వతంత్ర సంస్థగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేశారు. గౌతమ్ సారాభాయ్, గిరా సారాభాయ్ దీని ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.
క్యాంపస్‌లు
ఎన్ఐడీ అహ్మదాబాద్. దీని ఎక్స్టెన్షన్ క్యాంపస్‌లు గాంధీనగర్, బెంగళూరులో ఉన్నాయి. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, అసోంలలో క్యాంపస్‌లు ఉన్నాయి.
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీ.డిజైన్)
అహ్మదాబాద్ క్యాంపస్. సీట్ల సంఖ్య-125. విజయవాడలో 75, కురుక్షేత్రలో 75 సీట్లు ఉన్నాయి. ఎన్ఐడీ హర్యానాలో 75, ఎన్ఐడీ మధ్యప్రదేశ్-75, ఎన్ఐడీ అసోంలో 75 సీట్లు ఉన్నాయి.
ఎవరు అర్హులు?
2002, జూలై 1 లేదా తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (ఎన్సీఎల్)లు అయితే 23 ఏండ్ల లోపు ఉండాలి. పీహెచ్‌సీలకు 25 ఏండ్లు మించరాదు.
ఇంటర్లో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ తదితర ఏ స్ట్రీమ్లోఅయినా ఉత్తీర్ణులైనవారు లేదా సెకండియర్ పరీక్షలు రాయబోతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశాలు ఎలా కల్పిస్తారు ?
రెండుదశల్లో నిర్వహించే టెస్ట్‌ల ద్వారా ఎంపికచేస్తారు.
డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ)- ప్రిలిమ్స్, మెయిన్స్
ప్రిలిమ్స్: 2022, జనవరి 2
దీనిలో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి మెయిన్స్‌కు ఎంపికచేస్తారు.
ప్రిలిమ్స్ పరీక్షను 100 మార్కులకు 3 గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.
రాష్ట్రంలో హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రం ఉంది.
మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎం.డిజైన్)
ఇది రెండేండ్ల పీజీ కోర్సు. ఈ కోర్సు అహ్మదాబాద్, బెంగళూరు, గాంధీనగర్ క్యాంపస్‌లలో ఉంది.
ఎం.డిజైన్‌లో కమ్యూనికేషన్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ డిసిప్లినరీ డిజైన్ స్టడీస్, టెక్స్టైల్-అపెరల్-లైఫ్‌ైస్టెల్ అండ్ యాక్ససరీ డిజైన్ గ్రూపులు ఉన్నాయి.
అన్ని క్యాంపస్‌లలో కలిపి మొత్తం 347 సీట్లు ఉన్నాయి.
1992, జూలై 1 లేదా తర్వాత జన్మించిన వారు అర్హులు.
మూడేండ్ల/నాలుగేండ్ల డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి లేదా ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
రెండు దశల్లో నిర్వహించే డిజైనింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా ఎంపిక చేస్తారు.
బీ.డిజైన్, ఎం.డిజైన్ కోర్సులకు…
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: నవంబర్ 30
పరీక్షతేదీ: 2022, జనవరి 2
వెబ్సైట్: https://admissions.nid.edu/NIDA2022
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ