శాంతగార అంటే ఏమిటి? 1) శాంతి భద్రతలు కాపాడే అధికారి 2) విదేశాంగ మంత్రి 3) శాంతిని కొనసాగించడానికి గాను వసూలు చేసే పన్ను 4) గణతంత్ర రాజ్యాల్లోని పార్లమెంట్
కింది వాటిలో సరికానిది గుర్తించండి?
1) ఆమ్రపాలి అనే వైశాలికి చెందిన వేశ్య బుద్ధుడిని కలిసి బౌద్ధసన్యాసిగా మారింది 2) అంగుళిమాంబ అనే బందిపోటు దొంగకు బుద్ధుడు బౌద్ధమతాన్ని బోధించాడు 3) ఆనందుడు బుద్ధుని ప్రియశిష్యుడు 4) ఆచార్య నాగార్జునుడు బుద్ధుని శిష్యుల్లో ఒకడు
24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు ఎవరికి సమీప బంధువు?
కింది వాటిలో రాచరిక వ్యవస్థలున్న రాజ్యాలను గుర్తించండి? ఎ. మగధ బి. వైదేహ సి. మల్ల డి. ఛేది ఇ. లిచ్ఛవి 1) ఎ, బి, సి 2) ఎ, డి 3) ఎ, బి, డి 4) ఎ
గౌతమ బుద్ధుడికి సమకాలికుడైన వత్సరాజు ఉదయనుడు అవంతి రాణిని ప్రేమించి వివాహం చేసుకొనే కథ ఏ నాటకంలో ఉంది? 1) భానుడు రాసిన స్వప్న వాసవ దత్త 2) భానుడు రాసిన కాదంబరి 3) భవభూతి రాసిన ఉత్తర రామచరిత 4) కాళిదాసు రాసిన మాళవికాగ్నిమిత్ర
కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి? 1) బుద్ధుని గురువులు ఉద్రక, అలారకలామ 2) బుద్ధుడు జన్మించిన శాక్యతెగను అంతం చేసిన రాజ్యం అవంతి 3) బౌద్ధమతాన్ని స్వీకరించి సన్యాసిగా మారిన తొలిమహిళ గౌతమి ప్రజాపతి 4) గౌతమ బుద్ధుడు ఎక్కువ బోధనలు చేసిన నగరం శ్రావస్తి
జతపర్చండి ఎ. మహామాయ 1. బుద్ధుడి భార్య బి. గౌతమి ప్రజాపతి 2. బుద్ధుడి తల్లి సి. సుజాత 3. బుద్ధుడి పినతల్లి డి. యశోధర 4. బుద్ధుడికి ఆహారం ఇచ్చి మరొక జన్మనిచ్చిన తల్లి 1) ఎ-3, బి-2, సి-1, డి-4 2) ఎ-2, బి-3, సి-4, డి-1 3) ఎ-2, బి-3, సి-1, డి-4 4) ఎ-3, బి-2, సి-1, డి-4
కింది వాటిలో సరికాని జత ఏది? 1) స్థూపం- అస్తికలపై నిర్మించిన కట్టడం 2) ఆరామం- బౌద్ధుల సమాధులు 3) విహారం- బౌద్ధుల నివాస గృహం 4) చైత్యం- బౌద్ధుల ప్రార్థనా మందిరం
కింది వాటిలో సరికానిది ఏది? 1) గౌతమ బుద్ధుని బిరుదు తథాగత 2) స్థూపంలో లేని భాగం ఛత్రం 3) విద్యా కార్యక్రమాలకు నిలయమైన బౌద్ధ కేంద్రాలను విహారాలు అంటారు 4) బౌద్ధమత జన్మస్థలం సారనాథ్
గౌతమ బుద్ధుని జీవితానికి సంబంధించి ఏ సంఘటన వైశాఖ పౌర్ణమినాడు బోధి వృక్షం కింద జరిగింది? ఎ. జననం బి. మహాభియోగ నిష్క్రమణం సి. సంబోధి డి. ధర్మచక్ర పరివర్తన ఇ. మహాపరినిర్యాణం 1) ఎ, సి, ఇ 2) బి, సి, డి, ఇ 3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి, ఇ
కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి? 1) గౌతమ బుద్ధుడు అజ్ఞేయవాది 2) గౌతమ బుద్ధుడు కర్మ సిద్ధాంతాన్ని ఆమోదించాడు 3) బౌద్ధ పవిత్ర గ్రంథాలైన త్రిపీటకాలు పాళీ భాషలో రాశారు 4) బౌద్ధంలో 18 శాఖలున్నాయని ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు తెలిపాడు
కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి? 1) బౌద్ధ గ్రంథాల ప్రకారం మంజుశ్రీ బోధిసత్వుని జన్మస్థలం అమరావతి 2) బుద్ధుని బోధనల్లో అత్యంత ముఖ్యమైన 4 ఆర్యసత్యాలు, అష్టాంగ మార్గాలు సుత్తపీఠికలోని మజ్జిమనికాయలో ఉన్నాయి 3) శాద్వాదం, అనేకాంత వాదాలు జైనమతానికి చెందిన తత్వాలు 4) జైనమతంలో సాధారణమైన ఉపవాసాలను పోశాద అంటారు
కింది వాటిలో సరికాని జతను గుర్తించండి? 1) అస్మకరాజ్యం – పోదన 2) మగధ రాజ్యం – రాజగృహం 3) అంగరాజ్యం – పాటలీపుత్రం 4) మల్లరాజ్యం – పావ
కింది వాటిలో బౌద్ధ, జైనమతాలకు సంబంధించి సరైనది కానిది? 1) బౌద్ధమతం భారత్‌లో అంతమై విదేశాల్లో కొనసాగుతుంది. జైనమతం మాత్రమే విదేశాలకు వెళ్లాక భారత్‌లో నిరంతరాయంగా కొనసాగుతుంది 2) బౌద్ధం యజ్ఞయాగాలు, సామాజిక వివక్షతను వ్యతిరేకిస్తే జైనం వాటిని పూర్తిగా సమర్థించింది 3) బౌద్ధం మధ్యమార్గాన్ని అవలంబిస్తే, జైనం కఠినమైన, తీవ్రమైన సాంప్రదాయాలను పాటిస్తుంది 4) బౌద్ధం కంటే జైనం చాలా ప్రాచీనమైన మతం
కింది వారిలో జైనమతాన్ని ఆచరించిన చక్రవర్తులు ఎవరు? ఎ. చంద్రగుప్తమౌర్యుడు బి. ఖారవేలుడు సి. మహాపద్మనందుడు డి. అమోఘవర్షుడు 1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి 3) ఎ, బి, సి 4) ఎ, సి, డి
కింది వాటిలో సరికాని జత? 1) గచ్ఛ- జైన సన్యాసుల సంఘం 2) బసది- జైన దేవాలయం, జైన సన్యాసుల వసతి గృహం 3) సినగాగ్- క్రైస్తవుల ప్రార్థనా మందిరం 4) విమానం- హిందూ దేవాలయాల్లోని ఒక భాగం
జతపర్చండి. ఎ. మత్స్య రాజ్యం 1. తక్షశిల బి. గాంధార రాజ్యం 2. విరాట నగరం సి. అవంతి రాజ్యం 3. మధుర డి. శారసేన రాజ్యం 4. ఉజ్జయిని 1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-1, బి-2, సి-4, డి-3 3) ఎ-2, బి-1, సి-4, డి-3 4) ఎ-2, బి-1, సి-3, డి-4
కింది వారిలో వేదాంత తత్వాన్ని అనుసరించిన వారిని గుర్తించండి? ఎ. ఆదిశంకరాచార్య బి. స్వామి వివేకానంద సి. కుమారిల భట్టు డి. సర్వేపల్లి రాధాకృష్ణ 1) ఎ, బి, డి 2) ఎ, బి, సి, డి 3) ఎ, బి 4) ఎ, బి, సి
మగధ ఒక సామ్రాజ్యశక్తిగా ఎదగడంలో కింది వాటిలో దేని ప్రమేయం లేదు? 1) మగధ సైనిక శక్తి 2) మగధ పాలకుల సమర్థత 3) మగధకు అనుకూలంగా ఉన్న భౌగోళిక అంశాలు 4) మగధ బౌద్ధమతాన్ని ఆచరించడం
కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి? 1) అలెగ్జాండర్ భారతదేశంలోని కైబర్ కనుమల ద్వారా ప్రవేశించాడు 2) అలెగ్జాండర్ సేనాని సెల్యుకస్ నికేటర్ స్థాపించిన సెల్యుసిడ్ సామ్రాజ్య ముఖ్య కేంద్రం జోర్డాన్ 3) క్రీ.పూ 326లో అలెగ్జాండర్ జీలం నది ఒడ్డున పోరస్ను ఓడించాడు 4) అలెగ్జాండర్‌కు సమకాలికుడైన మగధ చక్రవర్తి ధననందుడు
క్రీ.పూ 6వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కింది వాటిలో సరైనదానిని గుర్తించండి? 1) ఈ కాలంలోనే ఇనుము వాడకం ప్రారంభమైంది 2) ఈ కాలంలోనే నాణేలు ప్రవేశపెట్టారు 3) ఈ కాలంలోనే భారత్‌లో తొలి నగరాలు వెలిశాయి 4) ఈ కాలంలోనే పొగాకు పంట విస్తారంగా పండించారు
నారువేసి వరిని పండించే విధానాన్ని మొదటిసారిగా ప్రస్తావించిన గ్రంథం? 1) కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం 2) పాణిని రాసిన అష్టాధ్యాయి 3) పతంజలి రాసిన మహాభాష్యం 4) విశాఖదత్తుడు రాసిన ముద్రారాక్షసం
కింది వాటిలో విద్ధాంక నాణేలకు సంబంధించి సరైనది కానిది? 1) ఈ నాణేలపై లిపి ఉండదు 2) ఈ నాణేలను వెండి, రాగితో తయారు చేశారు 3) ఈ నాణేలపై బొమ్మలను మాత్రమే ముద్రించారు 4) ఈ నాణేలను ముద్రించిన రాజులను కచ్చితంగా గుర్తించవచ్చు
భారత్‌లో వెలువడిన కింది వ్యాకరణ గ్రంథాల్లో తొలి గ్రంథం ఏది? 1) శర్మవర్మ రాసిన కాతంత్ర వ్యాకరణం 2) పాణిని రాసిన అష్టాధ్యాయి 3) పతంజలి రాసిన మహాభాష్యం 4) కేతన రాసిన ఆంధ్రభాషా భూషణం
కింది వాటిలో సరికాని వాక్యం? 1) ప్రాచీన కాలం నాటి శ్రేణులను ప్రస్తుతం ఉన్న వాణిజ్య బ్యాంకుల వ్యవస్థలతో పోల్చవచ్చు 2) ఢిల్లీ నగరానికి ప్రాచీన నామం శ్రావస్తి 3) సారనాథ్‌లో బుద్ధుని తొలి బోధనకు ఐదుగురు హాజరయ్యారు 4) ప్రత్యుత్తసముప్పద బౌద్ధమతానికి సంబంధించిన సిద్ధాంతం
గౌతమ బుద్ధునికి సంబంధించి సరైన జతకానిది? 1) గౌతమ బుద్ధుని జననం- కపిలవస్తు 2) గౌతమ బుద్ధుని జ్ఞానోదయం- గయ 3) గౌతమ బుద్ధుని తొలి బోధన- సారనాథ్ 4) గౌతమ బుద్ధుని మరణం- కుశి
జతపర్చండి. బౌద్ధసమావేశాలు ఎ. మొదటి సమావేశం 1. వైశాలి బి. రెండో సమావేశం 2. రాజగృహం సి. మూడో సమావేశం 3. కశ్మీర్ డి. నాలుగో సమావేశం 4. పాటలీపుత్రం 1) ఎ-2, బి-1, సి-3, డి-4 2) ఎ-2, బి-1, సి-4, డి-3 3) ఎ-1, బి-2, సి-4, డి-3 4) ఎ-1, బి-2, సి-3, డి-4