
ప్రతాపరుద్రుడు (కుమార రుద్రదేవుడు)
రెండో ప్రతాపరుద్రుడు విద్యార్థి దశలో కుమార రుద్రదేవుని పేరుతో భాస్కర రామాయణంలో ‘అయోధ్యకాండ’ రచించాడు.
‘యయాతి చరిత్ర’ నాటకాన్ని సంస్కృతంలో రచించాడు.
నోట్: పొన్నగంటి తెలగనార్యుడు ఇబ్రహీం కుతుబ్షా కాలంలో యయాతి చరిత్రను తెలుగులో రచించాడు.
గంగాదేవి
ఈమె అగస్త్యుని శిష్యురాలు.
తెలంగాణ ప్రాంతానికి (వరంగల్) చెందినప్పటికి విజయనగర యువరాజైన కుమార ‘కంపరాయలు’ను వివాహం చేసుకుంది.
తన భర్త మధురపై సాధించిన విజయాన్ని ‘మధుర విజయం’ (సంస్కృత కావ్యం) అనే గ్రంథంలో వివరించింది.
విరియాల కామసాని: క్రీ.శ 1000లో ‘గూడూరు శాసనం’ ను వేయించింది. ఇది తెలంగాణలో తొలి శాసనం. ఈమె తెలంగాణ తొలి కవయిత్రి.
పద్మనాయక వంశం లేదా రేచర్ల పద్మనాయకులు
విద్యారణ్యస్వామి
శృంగేరి పీఠాధిపతిగా వ్యవహరించిన ఇతని జన్మస్థలం కరీంనగర్ జిల్లా ధర్మపురి.
ఈయన సంగీతసారం (సంగీతశాస్త్రం) గ్రంథం రచించాడు.
విజయనగర సామ్రాజ్య స్థాపనకు ప్రేరకుడు.
సాయణుడు
ఈయన విద్యారణ్యస్వామి సోదరుడు
రచనలు: 1.చతుర్వేదాలకు భాష్యం
2. పురుషార్థ సుధానిధి
3. ఆయుర్వేద సుధానిధి
4. యజ్ఞతంత్ర సుధానిధి
5. ధాతువృద్ధి
6. ప్రాయశ్చిత్త సుధానిధి
పద్మనాయక భూపాలుడు: ఈయన సారంగధర చరిత్ర రచించి ‘సర్వజ్ఞ’ బిరుదు పొందాడు.
విశ్వేశ్వరుడు: ఈయన రచనలు చమత్కార చంద్రిక, వీరభద్ర విజృంభణ.
కవి బల్లటుడు: ఈయన రచనలు గుణమంజరి, పదమంజరి, శూద్రక రాజ చరిత్రం, బేతాళ పంచవింశతి.
మడికి సింగన (1420)
ఈయన రచనలు సకలనీతి సమ్మతం, పద్మపురాణోత్తర ఖండం, భాగవత దశమ స్కంధం (ద్విపద), జ్ఞాన వాశిష్ట రామాయణం (దీన్ని అహోబిల నరసింహస్వామికి అంకితమిచ్చాడు)
నోట్: రామగిరి దుర్గ నివాసి అయిన ఈయన తొలి తెలుగు సంకలన గ్రంథాన్ని రచించాడు.
సర్వజ్ఞ సింగభూపాలుడు: రచనలు.. రసావర్ణ సుధాకరం, సంగీత సుధాకరం, కందర్వసంభవం,
కువలయావళి (రత్నపాంచాలిక)
నోట్: శ్రీకృష్ణ దేవరాయల వలే రేచర్ల వెలమ వంశంలో బహుముఖ ప్రజ్ఞాశాలి.
గౌరన (1380-1450)
రాచకొండ వాస్తవ్యుడైన ఈయన నవనాథ చరిత్ర (దీన్ని శ్రీగిరి పండితుడు గౌరన ముందే చంపువుగా రాశాడు) లక్ష్మణ దీపిక, హరిశ్చంద్రోపాఖ్యానం అనే గ్రంథాలు రాశారు.
గౌరన తన కావ్యాలను శ్రీశైల మల్లికార్జునికి అంకితం ఇచ్చాడు.
నోట్: ‘సరస సాహిత్య లక్ష్మణ చక్రవర్తి’ ప్రతివాద మదగజ పంచాననుడు’ అనే బిరుదులు ఉన్నాయి.
కురవి గోపరాజు: ఈయన ‘సింహాసన ద్వాత్రింశక’ గ్రంథం రచించి హరిహరనాథునికి అంకితమిచ్చాడు.
నోట్: విక్రమార్క చరిత్ర అనే సంస్కృత కావ్యం ఆధారంగా దీన్ని రచించాడు.
పాల్కురికి తరువాత తెలంగాణ సాంఘిక జీవితాన్ని విస్తృతంగా వర్ణించిన కావ్యం సింహాసన ద్వాత్రింశిక.
పిల్లలమర్రి పిన వీరభద్రుడు (1480)
ఈయన సాళువ నరసింహరాయల ఆస్థాన కవి. శ్రీనాథుని సమకాలికుడు
శ్రీనాథుడు ‘బ్రహ్మీదత్త వీరప్రసాద్’ నని చెప్పుకోగా, పినవీరభద్రుడు ‘వాణి నా రాణి’ అని చెప్పుకున్నాడు.
రచనలు: శృంగార శాకుంతలంను చిల్లర వెన్నయామాత్యునికి ‘జైమిని భారతం’ను సాళువ నరసింహరాయలుకు అంకితం ఇచ్చాడు.
పశుపతి నాగ నాథుడు (14వ శతాబ్దం)
రేచర్ల మూడో అనపోత నాయని ఆస్థాన కవి.
రచనలు: విష్ణుపురాణం (అలభ్యం) మదన విలాసం
పోశెట్టి కవి (15వ శతాబ్దం)
ఇతను కుమ్మరి కులానికి చెందినవాడు.
రచనలు: నవచోళ చరిత్ర, వీరసంగమయ్య చరిత్ర, శిష్యప్రబోధం
భైరవ కవి
ఈయన గౌరన కుమారుడు.
రచనలు: శ్రీరంగ మహత్యం, రత్నశాస్త్రం కవి గజాంకుశం
చరిగొండ ధర్మన్న (15వ శతాబ్దం)
ఈయనకు ‘శతఘంట సురవూతాణుడు’, శతలేఖిని సురత్రాణ బిరుదులు ఉన్నాయి.
ఈయన రచించిన చిత్రభారతం (ఎనిమిది అశ్వాసాల ప్రబంధం) గ్రంథాన్ని ఎనుమలూరి పెద్దనామాత్యునికి అంకితం ఇచ్చాడు.
నోట్: పల్లె వెంకట సుబ్బారావు ఈ చిత్రభారత గ్రంథాన్ని 1920లో వచనంగా మలిచాడు.
అవధాన శబ్దాన్ని తెలుగు కావ్యాల్లో మొదటి సారిగా ప్రయోగించింది ఈయనే.
అనంతామాత్యుడు (1435)
భోజరాజీయం, ఛందోదర్పణం, రసాభరణం (రసార్ణవం)
సిద్ధరామకవి (1530-80)
ప్రభుదేవర వాక్యం అనే వేదాంత వచన గ్రంథాన్ని రచించాడు.
వినుకొండ వల్లభాచార్యుడు: తెలుగులో ‘క్రీడాభిరామం’ రచించాడు.
ఎలకూచి బాలసరస్వతి (1600-50)
ఈయన జటప్రోలు సంస్థాన ప్రభువు.
రచనలు: యాదవ రాఘవపాండవీయం (ఈ త్య్రర్థి కావ్యాన్ని వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చాడు)
కాకునూరు అప్పకవి (17వ శతాబ్దం)
రచనలు: 1. అంబికావాదం (యక్షగానం)
2. సాధ్విజన ధర్మం (ద్విపద కావ్యం)
3. అప్పకవీయం (లక్ష్మణ గ్రంథం)
4. అనంత వ్రతకల్పం (కావ్యం)
5. కవికల్పకం (లక్షణ గ్రంథం)
6. శ్రీశైలం మల్లికార్జున స్వామి పై శతకం
కుతుబ్ షాహీల యుగం (1518-1687)
సుల్తాన్ కులీకి బడేమాలిక్ (దొడ్డ ప్రభువు) అనే బిరుదు ఉంది.
జంషీద్ కూచిపూడి భాగవతులకు కూచిపూడి గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.
ఇబ్రహీం కుతుబ్షాను స్థానిక ప్రజలు, కవులు ‘మల్కీభరాముడు’గా పిలుచుకునేవారు. ఈయనే అనేక మంది కవులను పోషించాడు.
కుతుబ్ షాహీల ఆస్థాన కవులు
అద్దంకి గంగాధరుడు (1525-85)
గోల్కొండ నివాసి. ఈయన ‘తపతి సంవరణోపాఖ్యానం’ రచించాడు.
నోట్: ‘తపతీ సంవరణోపాఖ్యానం’ (ఇందులో మల్కీభరాముని ప్రేమ కథను వివరించాడు) గ్రంథాన్ని ఇబ్రహీం కుతుబ్షాకు అంకితమిచ్చాడు. మహ్మదీయ ప్రభువులకు తెలుగు కావ్యాలను అంకితమిచ్చిన తొలి కవి.
మల్లినాథసూరి (14వ శతాబ్దం)
ఈయన స్వస్థలం మెదక్ జిల్లాలోని కొలిచెలిమ.
ఇతని తండ్రి కపర్థి, సోదరుడు పెద్దిభట్టు.
సంస్కృత పంచమహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రాశాడు.
రచనలు: 1. శ్రీహర్షుని నైషధం- జివాతు
2. రఘువంశంపై వ్యాఖ్యానం- సంజీవని
3. కిరాతార్జునీయం- ఘంటాపథం
4. కుమార సంభవం
5. మేఘసందేశం
6. శిశుపాలవధ
కందుకూరి రుద్రకవి
రచనలు: 1. సుగ్రీవ విజయం (తొలి యక్షగానం)
2. జనార్ధనాష్టక స్తోత్రం
3. నిరంకుశోపాఖ్యానం
4. బలవదరీ శతకం
5. గువ్వల చెన్నని శతకం
నోట్: పాల్కురికి సోమన వృషభాష్టకం, బసవాస్టకం, త్రివిధ లింగాష్టకం రచించారు.
మల్లికార్జున పండితుడు అమరేశ్వరాష్టకం రచించాడు.
ఇబ్రహీం కుతుబ్షా రుద్రకవికి నల్లగొండ జిల్లాలోని చింతలపాలెంను అగ్రహారంగా దానం ఇచ్చారు.
పొన్నగంటి తెలగనార్యుడు (1520-80)
ఈయన యయాతి చరిత్రను రచించాడు. ఇది అచ్చ తెలుగులో రచించిన తొలి గ్రంథం.
నోట్: ఇబ్రహీం కుతుబ్షాకు సామంతరాజు అయిన అమీన్ఖాన్కు యయాతి చరిత్రను అంకితమిచ్చాడు.
సారంగ తమ్మయ్య
ఈయన‘వైజయంతి విలాసం’ (విప్రనారాయణ చరిత్ర) అనే శృంగార ప్రబంధం, ‘హరిభక్తి సుధోదయం) రచించాడు. తన కావ్యాన్ని ఇష్టదైవమైన శ్రీరామునికి అంకితమిచ్చాడు.
నోట్: ఈయన మహ్మద్ కుతుబ్షా కాలంలో (1558-1611) గోల్కొండ కరణంగా పనిచేశాడు.
నేబతి కృష్ణమంత్రి: ఈయన రచన ‘రాజనీతి రత్నాకరం’
ఎల్లారెడ్డి
రచనలు: 1. బాలభారతం (అగస్త్యుని రచనకు అనువాదం)
2. కిరాతార్జునీయం (భారవి రచనకు అనువాదం)
కామినేని మల్లారెడ్డి
ఈయన షట్చక్రవర్తి చరిత్ర, శివధర్మోత్తరం, పద్మపురాణం రచించాడు.
నోట్: మెదక్ దుర్గానికి సమీపంలోని బిక్కనవోలును రాజధానిగా చేసుకొని గోల్కొండ సుల్తానుల కింద సామంతునిగా పరిపాలన చేశాడు.
సురభి మాధవరాయలు (1650)
ఈయన పాలమూరు జిల్లాలోని జటప్రోలు సంస్థాన పాలకుడు.
చంద్రికా పరిణయం అనే ప్రబంధాన్ని రచించాడు.
నోట్: చంద్రికా పరిణయం అనే ప్రబంధానికి వెల్లాల సదాశివశాస్త్రి, అవధానం శేషశాస్త్రి కలిసి ‘శరదాగమనం’ అనే బృహత్వ్యాఖ్యానం’ రాశారు.
పొనుగోటి జగన్నాథాచార్యులు (1650)
ఈయన దేవరకొండ దుర్గం పాలకుడు, స్వయంగా కవి.
ఈయన ‘కుముదవల్లి విలాసం’ రచించాడు. ఇది భక్తరామదాసు జీవితానికి దగ్గరగా ఉంటుంది.
బమ్మెర పోతన: (1420-80)
ఈయన స్వస్థలం వరంగల్ జిల్లాలోని పాలకుర్తి మండల పరిధిలో గల బమ్మెర గ్రామం. పూర్వం ఈ గ్రామం నల్లగొండ జిల్లాలో ఉండేది.
తల్లిదండ్రులు: కేసన, లక్కమాంబ. గురువు ఇవటూరి సోమనారాధ్యుడు
బిరుదులు: సహజ పండితుడు, నిగర్వ చూడామణి
పోతన కొంతకాలం మూడో సింగభూపాలుని ఆస్థానంలో ఉన్నాడు.
రచనలు: 1. వీరభద్ర విజయం
2. భోగినీ దండకం
3. మహా భాగవతం (తెలుగు)
4. నారాయణ శతకం (అలభ్యం)
తన రచనలను మానవులకు అంకితం చేయనని ప్రతిజ్ఞ చేసిన తొలి తెలుగు కవి పోతన. భాగవతాన్ని తన ఇష్టదైవమైన శ్రీరామునికి అంకితం చేశాడు. శ్రీనాథుని సమకాలికుల్లో అగ్రగణ్యుడు. తొలి విప్లవ కవి.
మరిగంటి జగన్నాథాచార్యులు (1550-80)
కలలో రంగనాథుడు ఆదేశించిన ప్రకారం ‘శ్రీరంగనాథవిలాపం’ అనే ప్రబంధం రాశాడు.
ఈయన బిరుదు ‘శతావధాన శత లేఖిని సార్వభౌమ’.
మరిగంటి సింగరాచార్యులు (1520-90)
బిరుదులు: శతఘంటావధాని, అష్టభాషా కవితావిశారదుడు
రచనలు: 1. రాజనందన చరిత్ర
2. సీతాకల్యాణం (మొదటి అచ్చ తెలుగు నిరోష్ట్య రచన)
3. వరదరాజు స్తుతి
4. శ్రీరంగ శతకం
5. రామకృష్ణవిజయం (ద్వర్థి కావ్యం)
6. దశరథ రాజనందన చరిత్రం (నిరోష్ట్య కావ్యం)
7. రాఘపాండవీయం
నోట్: పదహారేండ్ల వయస్సులో నలయాదవ రాఘపాండవీయం అనే నాలుగర్థాల కావ్యం రాశాడు.
మొదటి వేంకటనరసింహాచార్యులు (1600)
రచనలు: 1. శ్రీకృష్ణ శతానందీయం
2. చిలువపడగరేని పేరణం (అచ్చ తెనుగు కావ్యం)
3. క్షత్రబందోపాఖ్యానం
4. రామానుజాభ్యుదయం
హరిభట్టు (1475-1550)
బిరుదు: అష్టఘంటావధాని
రచనలు:
1. వరాహపురాణం
2. నరసింహపురాణం
3. మత్స్యపురాణం
4. భాగవతం పుష్ట ఏకాదశ, ద్వాదశ స్కంధాలు రచించాడు.
ఏకామ్రనాథుడు
ఈయన రచించిన ప్రతాపరుద్ర చరిత్ర తెలుగులో మొట్టమొదటి వచన కావ్యం.
నోట్: ప్రతాపరుద్ర చరిత్రను 18వ శతాబ్దానికి చెందిన కూసుమంచి జగ్గకవి ‘సోమదేవ రాజకీయం’ పద్య కావ్యంగా రచించాడు.
సేకరణ: తెలంగాణ సమాజం – సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం (దేవపూజ పబ్లికేషన్) పుస్తకం నుంచి