కావలసిన పదార్థాలు
అవకాడో: రెండు, గోధుమపిండి: ఒక కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, కొత్తిమీర తురుము: పావు కప్పు, ఉప్పు, వెన్న: కొద్దిగా, నూనె: రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
ముందుగా అవకాడోలను ముక్కలు చేసి, గుజ్జుతీసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి మెత్తగా నూరుకోవాలి. ఒక గిన్నెలో గోధుమపిండి, అవకాడో గుజ్జు, పచ్చిమిర్చి ముద్ద, కొత్తిమీర తురుము, ఉప్పు, నూనె వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకొని అరగంటపాటు పక్కనపెట్టాలి. స్టవ్‌మీద పెనం పెట్టి, పిండి మిశ్రమాన్ని పరోటాల్లా ఒత్తుకుని రెండువైపులా వెన్న వేస్తూ కాల్చుకుంటే అవకాడో పరోటా సిద్ధం.