మధిరరూరల్, ఫిబ్రవరి 10 : పేదల కళ్లల్లో ఆనందం నింపడం కోసమే కంటివెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మంపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రెండోవిడత కంటివెలుగును సర్పంచ్ దొండపాటి రుక్మిణమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలెవరూ కంటి సమస్యలతో బాధపడొద్దనే ఉద్దేశంతో కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలతోపాటు మందులు ఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వేలాది కుటుంబాలకు అండగా మారిన బృహత్తర కార్యక్రమం కంటివెలుగు అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీపీ మెండెం లలిత, డీసీసీబీ వైస్‌చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, హెల్త్ సూపర్వైజర్ లంకా కొండయ్య, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా కృష్ణాపురం గ్రామంలో జరుగుతున్న శ్రీఅభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో జడ్పీ చైర్మన్ కమల్‌రాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట సర్పంచ్ బుర్రి సునీత, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
కంటి వెలుగును పకడ్బందీగా నిర్వహించాలి
చింతకాని, ఫిబ్రవరి 10 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని పల్లెస్థాయిలో పకడ్బందీగా నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందించాలని జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రాంబాబు అన్నారు. శుక్రవారం మండలంలోని బొప్పారం, రాఘవాపురం తదితర గ్రామాల్లో జరుగుతున్న కంటి వెలుగు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం 262 మందికి కంటి వైద్యపరీక్షలు నిర్వహించగా 86 మందికి ఉచితంగా కళ్ళజోళ్లు అందించామని, 29మందికి ఆపరేషన్ కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి పంపించామని వైద్యసిబ్బంది తెలిపారు. వైద్యులు తోళ్ల వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ వేమిశెట్టి కృష్ణారావు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, ఫిబ్రవరి 10 : కంటివెలుగు ప్రతిపేదింటి వెలుగు కార్యక్రమమని ఎంపీపీ దేవరకొండ శిరీష అన్నారు. మండలంలోని పెద్దగోపవరం గ్రామంలో శుక్రవారం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ చావా రామకృష్ణ, సర్పంచ్ ఇనుపనూరి శివాజీ, ఎంపీటీసీ సగ్గుర్తి కిశోర్‌బాబు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, బుచ్చయ్య, శ్రీనివాసరెడ్డి, భాస్కర్, వార్డుమెంబర్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.