కాన్పూర్ (యూపీ): యూపీలోని కాన్పూర్‌లో జికా వైరస్ కేసు వెలుగుచూసింది. భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఓ అధికారి గత కొద్ది రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. కాన్పూర్‌లోని ఐఏఎఫ్ దవాఖానలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు జికా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. ఆ అధికారితో సన్నిహితంగా మెలిగిన పలువురి నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపారు.