Nagaland | కోహిమా: నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌తో ఓటింగ్‌ను బహిష్కరించడంతో ఆయా జిల్లాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు దాదాపు ‘సున్నా’ శాతం పోలింగ్ నమోదైంది! ‘ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటరీ(ఎఫ్ఎన్టీ)’ పేరుతో ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ఈఎన్‌పీవో) గత 15 ఏండ్లుగా ఆందోళనలు చేస్తున్నది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని ఆ సంఘం ఇటీవల ఆరు జిల్లాల ప్రజలకు పిలుపునిచ్చింది. ఆరు జిల్లాల పరిధిలో ఉండే 20 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఓటేయలేదని తెలుస్తున్నది.