చెన్నై: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ తమ ఫ్యాన్స్‌కు ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిం ది. 16 ఏండ్లు తమ జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేసిన స్టీఫెన్ ఫ్లెమింగ్ వైదొలగడంతో రాబోయే సీజన్ నుంచి ఆ స్థానాన్ని భారత దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్‌తో భర్తీ చేయించింది. ప్రధాన కోచ్‌గా బదానీ, ఫ్లింటాఫ్, రైనా పేర్లు వినిపించినా చెన్నై యాజమాన్యం మాత్రం జహీర్ పేరును ప్రకటించడం గమనార్హం.