భూపాలపల్లి టౌన్, ఫిబ్రవరి 22: జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి ప్రభుత్వ దవాఖానలో మగబిడ్డకు జన్మనిచ్చారు. మంగళవారం ఉదయం ఆమె ప్రసవం కోసం భూపాలపల్లిలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో చేరారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ తిరుపతి, గైనకాలజిస్టులు కట్ట శ్రీదేవి, కట్ట లావణ్య, అనస్తీషియా డాక్టర్ శ్రీకాంత్ ఆమెకు కేసీఆర్ కిట్ అందజేశారు. సర్కారు వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలనే తాను ప్రభుత్వ దవాఖానలో చేరానని హర్షిణి తెలిపారు.