ఏప్రిల్ 9న షర్మిల బహిరంగ సభ.. వేదిక ఖరారు
షర్మిల బహిరంగ సభ| షర్మిల బహిరంగ సభకు వేదిక ఖరారైంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ మైదానంలో బహిరంగ సభ జరుగనుంది.
ఖమ్మం : తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్నట్లు వైఎస్ షర్మిల గతంలోనే చెప్పారు. ఏప్రిల్ 9న లక్షమందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ ప్రకటిస్తానని ఆమె వెల్లడించారు.
ఈ నేపథ్యంలో షర్మిల బహిరంగ సభకు బుధవారం వేదిక ఖరారైంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ మైదానంలో బహిరంగ సభ జరుగనుంది.
ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఈ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు అనుమతి లభిస్తుందా.? అన్న సందేహానికి సైతం తెరపడింది.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు.
ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు షర్మిల ప్రకటించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు నియోజకవర్గం అలాంటిదే అని ఆమె చెప్పారు. తెలంగాణలో తన పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని షర్మిల అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?


