Gorantla : అధ్యక్షుడు జగన్ సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అరాచకవాదులుగా మారారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శ చేశారు. ఆ పార్టీ నేతలు అందరూ హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గోరంట్ల రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను ఓ వర్గాన్ని విమర్శించినట్లు సాక్షి మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని గోరంట్ల మండిపడ్డారు. నా వ్యాఖ్యలను వక్రీకరించి రాస్తున్నారని విమర్శించారు. తప్పుడు రాతలతో కులాలు, మతాల మధ్య వైషమ్యాలు సృష్టించొద్దని కోరుతున్నానని సాక్షి మీడియాను ఉద్దేశించి అన్నారు.
తనపై తప్పుడు రాతలు రాసినందుకు సాక్షి మీడియా క్షమాపణలు చెప్పాలని గోరంట్ల డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం దావా వేస్తానని, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడమే జగన్ లక్ష్యంగా మారిందని ఆయన మండిపడ్డారు.