YouTube | హైదరాబాద్: ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ చిన్న క్రియేటర్లకు సైతం ఉపయోగపడేలా మానిటైజేషన్ నిబంధనల్లో మార్పులు చేసింది. మానిటైజేషన్‌కు అర్హత సాధించేందుకు కావాల్సిన సబ్‌స్ర్కైబర్ల సంఖ్యను సగానికి తగ్గించింది. చిన్న క్రియేటర్లు సైతం మానిటైజేషన్ టూల్స్‌ను పొందేందుకు వీలుగా ఈ నిబంధనలను మార్చింది.
దీంతో ఇక నుంచి తక్కువ సబ్‌స్ర్కైబర్లు (500 మంది) కలిగిన కంటెంట్ క్రియేటర్లు సైతం యూట్యూబ్‌లో డబ్బులు పొందవచ్చు. అలాగే చివరి 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్ వీడియోలను ఆప్‌లోడ్ చేసి ఉండాలి. అలాగే ఏడాదిలో 300 గంటల వీక్షణలు లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్ వ్వూస్ కావాలి. అయితే భారత్‌లో ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చేది అధికారికంగా ఇంకా వెల్లడించ లేదు.