సదాశివనగర్, డిసెంబర్ 5: నేటి యువత అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన చూపిన బాటలో నడువాలని జిల్లా అడిషనల్ ఎస్పీ అన్యోన్య అన్నారు. మండలంలోని అడ్లూర్ఎల్లారెడ్డి గ్రామంలో సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. నేటి యువత దేశం కోసం కృషి చేసిన మహా నాయకులు చూపిన బాటలో నడువాలని సూచించారు. అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు.
అబ్దుల్ కలాం విగ్రహాన్ని సమాచార హక్కు చట్టం ప్రతినిధులు ఏర్పాటు చేయడంతో వారిని అభినందించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీకి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం, రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న, సర్పంచ్ జానకి, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ, విండో చైర్మన్ సదాశివారెడ్డి, ఎంపీటీసీలు లక్ష్మీ రాజలింగం, రేణుకా నర్సింహులు, ఆర్టీఐ మండల ప్రధాన కార్యదర్శి తిరుమల నీతిన్ గౌడ్, అడ్లూర్ ఎల్లారెడ్డి ఆర్టీఐ అధ్యక్షుడు ఆకుల లింగం, జిల్లా ఉపాధ్యక్షుడు అలీం, ఎంకపల్లి రాజేందర్ యాదవ్, రంగ ఆంజనేయులు, సదాశివనగర్ సీఐ రామన్, ఎస్సై శేఖర్, వార్డు సభ్యుడు మొసర్ల శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.