గద్వాల : గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిపై కత్తితో దాడి ( Attack ) చేసిన ఘటన గద్వాల( Gadwal) పట్టణంలో సంచలనం రేపింది. స్థానికుల కథనం మేరకు. గద్వాల పట్టణంలోని గంజిపేట కాలనీకి చెందిన రవితేజ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ విద్యాభాషం చేస్తున్నాడు
. అంబేద్కర్ కాలనీకి చెందిన గుర్తు తెలియని వ్యక్తులతో కొన్ని రోజుల క్రితం వివాదం చోటుచేసుకుంది. సదరు వ్యక్తులు యువకులు బుధవారం కోట సమీపంలో యువకుడితో ఘర్షణకు దిగి రవితేజను ఛాతీలో కత్తితో పొడిచి పారిపోయారు. గొడవను అడ్డుకునేందుకు చరణ్ తేజ అనే యువకుడు ప్రయత్నించగా అతగికి సైతం స్వల్ప గాయాలు అయ్యాయి.
గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం బాధితుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రవితేజ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.