తైపీ సిటీ: భారత యువ షట్లర్ 17 ఏండ్ల తన్వి శర్మ తైపీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో తన్వి21-17, 21-11తో లోకల్ షట్లర్, ప్రపంచ24వ ర్యాంకర్ హువాంగ్ యు-హుసున్ను చిత్తు చేసింది. కేవలం 33 నిమిషాల్లోనే ముగిసిన ఈ ఏకపక్ష పోరులో తన్వి బలమైన స్ట్రోక్స్, క్రాస్ కోర్ట్ స్మాష్లతో చెలరేగిపోయింది.
మరో సెమీఫైనల్లో అథ్లెట్ ఉన్నతి హుడా15-21, 18-21తోప్రపంచ 21వ ర్యాంకర్ తుయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో ఓటమి పాలైంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆరో సీడో ఎన్గుయెన్ తన్వి తలపడనుంది.