
యాసంగిలో నాగర్కర్నూల్ జిల్లా రైతన్నలు రికార్డు స్థాయిలో పంటల సాగు చేపట్టారు. లక్షా 57 వేల ఎకరాల్లో పంటల సాగుతో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కాగా కేంద్రం వైఖరితో.. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు వరి సాగు బాగా తగ్గింది. వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించడంతో వేరుశనగ సాగుకు రైతన్న మొగ్గు చూపారు. పప్పు ధాన్యాలకూ ప్రాధాన్యం కల్పించారు. సాగుకు సంబంధించిన నివేదికను వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు.
నాగర్కర్నూల్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : నాగర్కర్నూల్ జిల్లాలో పుష్కలంగా సా గు నీరు ఉండడంతో యాసంగి సాగుపై రైతులు దృష్టి సారించారు. దీంతో రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా అత్యధిక ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతున్నాయి. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జిల్లాలో 1,57,694 ఎకరాల్లో ఆయా పంటలు పండిస్తున్నారు. జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో నిజామాబాద్ (94 వేల ఎకరాలు), కామారెడ్డి (81 వేలు) ఆదిలాబాద్ (77 వేలు), నిర్మల్ జిల్లా (75 వేల ఎకరాలు) నిలిచాయి. కాగా, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తిలో 55 వేల ఎకరాల్లో పంటలు సాగవుతూ రెండో స్థానంలో ఉన్నది. నాగర్కర్నూల్ జిల్లాలో 1.57 లక్షల ఎకరాల్లో ఆయా పం టలు సాగవుతుండగా.. అత్యధికంగా 1,37,310 ఎకరాల్లో వేరుశనగ పండిస్తుండడం గమనార్హం. కందులు 16,908, జొన్న 1,187, జొన్న 532 ఎకరాల్లో సాగవుతున్నది.
గణనీయంగా తగ్గిన వరి..
జిల్లాలో వరి సాగు గణనీయంగా తగ్గింది. కేం ద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేయడంతో రైతన్నల్లో ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచనల మే రకు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయి లో పర్యటించి వరితో కలిగే నష్టాలను రైతులకు వివరించారు. ఫలితంగా ఊహించని స్థాయిలో వరిసాగు పడిపోయింది. గత యాసంగిలో వరి అంచనాకు మించి సాగైంది. 43,189 ఎకరాల్లో అంచనా ఉండగా.. 1,47,829 ఎకరాల్లో సాగు చేశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు కేవలం 153 ఎకరాల్లోనే వరి వేయడం గ మనార్హం. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కూ డా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని ఇ ప్పటికే ప్రకటించింది. ఈ పరిస్థితులలో రైతులు వరిసాగును స్వచ్ఛందంగా తగ్గించుకున్నారు. ప్ర త్యామ్నాయంగా వేరుశనగ, జొన్న, కందులు వం టి ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. రా ష్ట్ర ప్రభుత్వం ఆదేశంతో గ్రామ స్థాయిలో రైతుల కు అవగాహన కల్పిస్తున్నట్లు డీఏవో వెంకటేశ్వర్లు తెలిపారు. డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతు లు ఆసక్తి చూపుతున్నారన్నారు.