YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
YTPS | రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరుగడంతో ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)పైనే ఆశలు పెట్టుకున్నది. కేసీఆర్ ప్రభత్వ హయాంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో పూర్తిస్థాయి ఉత్పత్తి ద్వారా రాష్ట్ర అవసరాలను తీర్చేంందుకు ప్రయత్నిస్తున్నది.
YTPS | హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరుగడంతో ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)పైనే ఆశలు పెట్టుకున్నది. కేసీఆర్ ప్రభత్వ హయాంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో పూర్తిస్థాయి ఉత్పత్తి ద్వారా రాష్ట్ర అవసరాలను తీర్చేంందుకు ప్రయత్నిస్తున్నది. 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ విద్యుత్తు కేంద్రంలో ఇప్పటికే 4 యూనిట్లు నడుస్తున్నాయి. వీటి ద్వారా రోజూ 1,800 నుంచి 2,300 మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్‌కు సరఫరా చేస్తున్నారు. బొగ్గు కొరతతో సతమతమవుతున్న వైటీపీఎస్‌కు ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి రోజుకు 4-5 రేకుల బొగ్గు అందుతున్నది. దీనితోపాటు శక్తి పాలసీ విండో-2 కింద మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి కూడా బొగ్గు తెప్పిస్తున్నారు. వైటీపీఎస్‌లో కోల్ హ్యాడ్లింగ్ సమస్యలను తొలగించేందుకు చేపట్టిన ఆధునీకరణ పనులు ఈ నెలాఖరుకు పూర్తికానున్నాయి. దీంతో గంటకు 2,500 టన్నుల బొగ్గు అన్‌లోడింగ్‌కు, రోజుకు 12-14 రేకుల బొగ్గుకి వీలవుతుంది. ఇటీవల వైటీపీఎస్‌లో ఐదో యూనిట్ సింక్రనైజేషన్ పూర్తయ్యింది. నవంబర్ నాటికి ఈ యూనిట్‌ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
రోజుకు రెండుసార్లు సమీక్షలు
వైటీపీఎస్ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మిగిలిన పనులను గడువులోగా పూర్తిచేసేందుకు ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్, జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్ హరీశ్ రోజుకు రెండుసార్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 2, 8న వైటీపీఎస్ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేసిన నవీన్ మిట్టల్.. 13 నుంచి 19 వరకు అక్కడే ఉన్నారు. శుక్రవారం జెన్కో సీఎండీ సైతం వైటీపీఎస్లోనే మకాం వేశారు. ప్లాంట్‌లో మానవవనరుల అవసరాలు తీర్చేందుకు హెడ్‌క్వార్టర్స్‌తోపాటు ఇతర విద్యుత్తు ప్లాంట్ల నుంచి ఇంజినీరింగ్ సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ టర్బైన్, వాటర్ సిస్టమ్స్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌తోపాటు ప్రధాన వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

