Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Congress | ఒకప్పుడు నలుగురికి అన్నం పెట్టిన రైతన్న.. నేడు తన కుటుంబాన్ని సాకడానికి రోజువారీ కూలీగా మారాడు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట కండ్లముందే ఎండిపోవడంతో కన్నీటి పర్యంతమయ్యాడు.
Congress | రాజాపేట, నవంబర్ 3: ఒకప్పుడు నలుగురికి అన్నం పెట్టిన రైతన్న.. నేడు తన కుటుంబాన్ని సాకడానికి రోజువారీ కూలీగా మారాడు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట కండ్లముందే ఎండిపోవడంతో కన్నీటి పర్యంతమయ్యాడు. వ్యవసాయమే జీవనాధారంగా బతికిన అన్నదాతకు ఇప్పుడు కూలి పనులే దికయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కొండ్రెడ్డిచెరువు గ్రామానికి చెందిన నీల లక్ష్మీనారాయణకు ఐదెకరాల భూమి ఉన్నది. ఒక బోరు ఆధారంగా మూడు ఎకరాల్లో వరి సాగుచేశాడు.
తీరా పంట పొట్ట దశకు చేరే సమయంలో విద్యుత్తు కోతలు, వర్షాభావ పరిస్థితులతో నీరందక పంట మొత్తం ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడి బూడిద కావడంతో దికుతోచని స్థితిలో పడిపోయాడు. వ్యవసాయానికి తోడుగా ఉన్న నాలుగు పశువులకు నీరు, గ్రాసం అందించలేక వాటిని సైతం అమ్ముకున్నాడు. ఓ వైపు పంట నష్టం.. మరోవైపు కుటుంబ పోషణ భారంగా కావడంతో చేసేదేమీ లేక రోజువారీ కూలీగా మారాడు. ఒకప్పుడు తన పొలంలో వ్యవసాయం చేసిన చేతులే.. నేడు కూలి పనులు చేస్తున్నాయి. వడ్లు పండించే రైతన్నే పట్టెడన్నం కోసం కష్టపడాల్సిన దుస్థితి రావడం పలువురిని కలచివేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
Bigg Boss 10 | ముకేష్, వర్షిణిపై మాటల యుద్ధం.. దేబ్జానీ ఎమోషనల్.. శివ, త్రిగుణ్ ఫైర్!
Kollapur | ఫంక్షన్ హాల్లో బర్త్ డే సెలబ్రేషన్ వద్దు.. అమ్మ సమాధి దగ్గరే కేక్ కట్ చేస్తా.. ఆరేళ్ల బాలుడి నిర్ణయానికి కన్నీళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

