తల్లి సమాధి వద్ద బర్త్‌డే
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి గోవింద్‌రెడ్డి, వనజారెడ్డి దంపతులకు చాలా ఏండ్లకు బాబు జన్మించాడు. బాలుడు ఆర్యన్‌కు ఆరేండ్లు నిండకముందే తల్లి ప్రేమకు దూరమయ్యాడు.
కొల్లాపూర్, నవంబర్ 3 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి గోవింద్‌రెడ్డి, వనజారెడ్డి దంపతులకు చాలా ఏండ్లకు బాబు జన్మించాడు. బాలుడు ఆర్యన్‌కు ఆరేండ్లు నిండకముందే తల్లి ప్రేమకు దూరమయ్యాడు. గతేడాది మార్చిలో అనారోగ్యంతో వనజ మృతి చెందింది. తల్లి లేని లోటు తెలియకుండా బాలుడి తండ్రి ప్రేమానురాగాలు పంచు తూ హైదరాబాద్‌లో చదివిస్తున్నాడు.
మంగళవారం ఆర్యన్ పుట్టిన రోజు ఉండగా.. వేడుకలను ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించేందుకు గోవింద్ ఏర్పాట్లు చేశాడు. బంధువులు, సన్నిహితులకు ఆహ్వానం అందించాడు. ఆఖరి నిమిషంలో కొడుకు బర్త్‌డే వేడుకలు వద్దని.. తన తల్లి సమాధి వద్ద పుట్టిన రోజు వేడుకను జరుపుకొంటానని తండ్రితో చెప్పా డు. దీంతో చేసేది లేక ఏర్పాట్లను క్యాన్సిల్ చేసిన గోవింద్ కొడుకుతో తన వ్యవసాయ పొలం వద్దకు చేరుకొని వనజారెడ్డి సమాధిని పూలతో అలంకరించి అక్కడే కేక్ కట్ చేసి నిరాడంబరంగా పుట్టినరోజు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

