యాదాద్రి/గుండాల/ఆత్మకూర్(ఎం)/రాజాపేట, నవంబర్7 :‘ప్లాస్టిక్ నిషేధిద్దాం.. పర్యావరణాన్ని కపాడుదాం’ అని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పిలుపునిచ్చారు. స్వచ్ఛ వారోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం చేపట్టిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. తడి, పొడిచెత్తను వేరుచేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. యాదాద్రిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పట్టణ ప్రజలపై ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, కమిషనర్ అజయ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు, వ్యాపారస్తులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా గుండాల మండల కేంద్రంలో చేపట్టిన పారిశుధ్య పనులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ తాండ్ర అమరావతీశోభన్బాబు, తాసీల్దార్ దయాకర్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంపీఓ జనార్దన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేశ్ ఉన్నారు. ఆత్మకూర్(ఎం) మండలం పారుపల్లిలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. గ్రామాలు పచ్చదనంతోపాటు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఆయన వెంట తాసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ ఆవుల రాములు, సర్పంచ్ లగ్గాని రమేశ్‌గౌడ్, ఆర్ఐ యాదగిరి, ఏపీఓ రమేశ్ ఉన్నారు. రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో స్వచ్ఛ వారోత్సవాలు కొనసాగాయి. ఈ సందర్భంగా పారిశుధ్య పనులు చేపట్టారు. సర్పంచులు, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్వచ్ఛ వారోత్సవాలను విజయవంతం చేయాలి
ఆత్మకూరు(ఎం) : స్వచ్ఛ వారోత్సవాలను విజయవంతం చేయాలని ఎంపీడీఓ ఆవుల రాములు కోరారు. ఆదివారం మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులతో కలిసి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ జన్నాయికోడె నగేశ్, ఎంపీటీసీ యాస కవిత, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.