శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ పరివార దేవతలకు విశేష పూజలు చేశారు. మంగళవారం ఉదయం కుమారస్వామికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా సాయంత్రం ప్రదోషకాలంలో క్షేత్రపాలకుడైన
బయలు వీరభద్రస్వామికి పంచామృతాభిషేకాలు, పుష్పార్చనలు జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. ప్రధాన ఆలయంలో నందిమండపంలో కొలువైన శనగల బసవన్న పూలు, పండ్లు, జలాలతో అభిషేకించి షోడశోపచార పూజలు చేశారు. నందీశ్వరునికి శనగలు నైవేద్యంగా సమర్పించి వర్షాలు సకాలంలో కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు దేవస్థానం ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.