ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే: లక్షణాలు..చేయించుకోవాల్సిన పరీక్షలివే..!!

న్యూఢిల్లీ: జూన్ 8.. ఈ రోజు ప్రతి ఏటా ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డేగా నిర్వహిస్తారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ రోజు లక్ష్యం. 2000లో మొదట జర్మన్ జూన్ 8ని బ్రెయిన్ ట్యూమర్ డేగా ప్రకటించింది. బాధ్యతాయుతమైన మానవులుగా, వ్యాధి ఉన్న రోగులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి తెలుసుకోవడం, వారికి జీవితాన్ని సులభతరం చేయడానికి ప్రయత్నించడం మన బాధ్యత.
బ్రెయిన్ ట్యూమర్లో పలు రకాలున్నాయి. పిట్యూటరీ ట్యూమర్స్, మెనింగియోమాస్, స్క్వాన్నోమాస్, పీనియల్ గ్లాండ్ ట్యూమర్, ప్రైమరీ సెంట్రల్ నర్వస్ సిస్టం (సీఎన్ఎస్) లింఫోమాస్.
బ్రెయిన్‌ట్యూమర్ లక్షణాలు
దీర్ఘకాలిక లేదా పునరావృత తలనొప్పి
జ్ఞాపకశక్తి తగ్గిపోవడం
వాంతులు
గందరగోళం
మసక దృష్టి
చదవడం, రాయడంలో ఇబ్బంది
చేతి వణుకు
రుచి, వాసన, వినగల సామర్థ్యం తగ్గుదల..
చేయి, ముఖం లేదా కాళ్ల కండరాలు బలహీనపడడం..
వెర్టిగో లేదా మైకం కమ్మడం..
ప్రమాద కారకాలు..
కుటుంబ ఆరోగ్య చరిత్ర బ్రెయిన్ ట్యూమర్స్ అభివృద్ధికి ప్రమాద కారకమవుతుంది.
వయసుతోపాటు ట్యూమర్స్ పెరుగుతాయి.
వివిధ రసాయనాల ప్రభావం శరీరంపై పడినప్పుడు లేదా రేడియేషన్‌కు గురైనప్పుడు కణతులు (ట్యూమర్స్) ఏర్పడుతాయి.
బ్రెయిన్ ట్యూమర్ రోగనిర్ధారణ..
అవయవాల సమన్వయం, కండరాల బలం, జ్ఞాపకశక్తి, విశ్లేషణాత్మక నైపుణ్యాలను పరీక్షించడం
యాంజియోగ్రఫీ
తలభాగం సీటీ స్కాన్..
బయాప్సీ
తలభాగం ఎంఆర్ఐ స్కాన్
పుర్రె ఎక్స్-రే
చికిత్సా పద్ధతులు..
బ్రెయిన్ ట్యూమర్‌కు ప్రధానంగా కీమోథెరపీని, రేడియేషన్ థెరపీతో కలిపి శస్త్రచికిత్స చేస్తారు. అలాగే, పోస్ట్ న్యూరో సర్జరీ ట్రీట్మెంట్లో భాగంగా ఫిజికల్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ కూడా ముఖ్యమైనవి. చికిత్స అనేది కణతి రకం, రోగి సాధారణ ఆరోగ్యం, కణతి స్థానం, ట్యూమర్ పరిమాణంపై కూడా ఆధారపడి ఉంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

