‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
కోర్టుల్లో కేసుల విచారణలో దోషులకు శిక్షలు పడే కన్విక్షన్ శాతాన్ని మరింత పెంచే దిశగా కోర్టు డ్యూటీ అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పని చేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో...
– కోర్టు డ్యూటీ అధికారుల సమీక్ష సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్
నీలగిరి, అక్టోబర్ 31 : కోర్టుల్లో కేసుల విచారణలో దోషులకు శిక్షలు పడే కన్విక్షన్ శాతాన్ని మరింత పెంచే దిశగా కోర్టు డ్యూటీ అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పని చేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుల విచారణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రతి కేసులో నేర నిరూపణ జరిగేలా సంబంధిత అధికారుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. ప్రతి కేసులో దర్యాప్తు సమయంలో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు, ఇతర కీలక పత్రాలను కోర్టులో సమర్పించే విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా దర్యాప్తు అధికారులతో కోర్టు డ్యూటీ అధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. కేసుల విచారణలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పోక్సో కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కేసుల విచారణలో సాక్షుల హాజరు, సాక్ష్యాధారాల సమర్పణ. కోర్టు ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షించాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయం చేసుకుంటూ నిండితులకు చట్టప్రకారం శిక్షలు పడేలా కృషి చేయాలని తెలిపారు. కేసుల్లో కన్విక్షన్ శాతం పెంపునకు ప్రతి కోర్టు డ్యూటీ అధికారి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, కేసుల విచారణలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో చొరవ చూపాలన్నారు. కోర్టుల్లో నిందితులకు శిక్షలు పడేలా సమర్థవంతమైన సమన్వయం చేసి, కన్విక్షన్ శాతం పెంపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను ఆయన అభినందించారు. భవిష్యత్‌లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేశ్, సీఐలు శ్రీను నాయక్, బీషన్న, సంబంధిత పోలీస్ అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.

‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
ఘనంగా సర్దార్ పటేల్ జయంతి వేడుకలు
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధానమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని శనివారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ ఐక్యత దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ శివప్రసాద్, ఎస్బీ డిఎస్పీ మల్లారెడ్డి, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఆర్.ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

