అక్రమంగా అండాల సేకరణపై ఉదాసీనత
నిరుపేద మహిళల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని అక్రమంగా అండాలు సేకరిస్తున్న భారీ దందాలో ప్రధాన సూత్రధారులైన కార్పొరేట్ దవాఖానలు, ఫర్టిలిటీ ల్యాబ్‌లపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
-
దవాఖానలు, ల్యాబ్‌లపై చర్యలు శూన్యం
-
కేవలం ఏజెంట్లపైనే కేసులు చేయడంపై మహిళా కమిషన్ ఆగ్రహం
-
తీవ్ర పరిణామాలు తప్పవని అధికారులకు హెచ్చరిక
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): నిరుపేద మహిళల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని అక్రమంగా అండాలు సేకరిస్తున్న భారీ దందాలో ప్రధాన సూత్రధారులైన కార్పొరేట్ దవాఖానలు, ఫర్టిలిటీ ల్యాబ్‌లపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం కొందరు ఏజెంట్లపై నామమాత్రంగా కేసులు నమోదు చేసి, చేతులు దులిపేసుకోవడంపై మండిపడింది. అసలు సూత్రధారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించినా ఎందుకు జాప్యం చేస్తున్నారని శనివారం ఓ ప్రకటనలో నిలదీసింది.
ప్రధాన నిందితులను తప్పించే ప్రయత్నాలు
కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద స్వయంగా బాధిత మహిళలను పరామర్శించిన సమయంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇందిరా ఐవీఎఫ్ సెంటర్, నర్మద ఫర్టిలిటీ సెంటర్, ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్, సద్గురు ఏఆర్టీ సెంటర్, పద్మజ ఫెర్టిలిటీ సెంటర్లతోపాటు డాక్టర్ హుస్సేన్ అనే కీలక వ్యక్తి పేరును బాధితులు తమ వాంగ్మూలంలో నేరుగా ప్రస్తావించారు. అయినప్పటికీ హుస్సేన్ జాడను పోలీసులు ఇప్పటివరకు కనిపెట్టకపోవడం, కనీసం ప్రాథమిక కేసు కూడా నమోదు చేయకపోవడం శోచనీయమని కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఉన్నత స్థాయి ఒత్తిళ్ల వల్లే నిందితులను తప్పిస్తు న్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేరొన్నది. కనీస విచారణ కూడా ప్రారంభించకపోవడాన్ని కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. మహిళల శారీరక స్వేచ్ఛ, గౌరవం, ప్రాణాలతో చెలగాటమాడుతూ అక్రమ వ్యాపారానికి తెగబడినవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికైనా బాధ్యులపై కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలని, లేకుంటే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదురోక తప్పదని అధికారులను హెచ్చరించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

