దూదేకుల కార్పొరేషన్ అమలు చేయండి
రాష్ట్రంలో ముస్లిం దూదేకుల కులాన్ని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ముస్లిం దూదేకుల నూర్ బాషా వెనుకబడిన తరగతుల సంక్షేమ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్రభారతిలో దూదేకుల సాంసృతిక సదస్సును శనివారం ఘనంగా నిర్వహించారు.
- సాంస్కృతిక సదస్సులో వక్తలు
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ముస్లిం దూదేకుల కులాన్ని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ముస్లిం దూదేకుల నూర్ బాషా వెనుకబడిన తరగతుల సంక్షేమ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్రభారతిలో దూదేకుల సాంసృతిక సదస్సును శనివారం ఘనంగా నిర్వహించారు. సదస్సులో జేఏసీ చైర్మన్ మహమ్మద్ రఫీ, గౌరవ అధ్యక్షుడు షేక్ సత్తార్, వైస్ చైర్మన్ రాజఅహ్మద్, ప్రధాన కార్యదర్శి సంధాని, అదనపు ప్రధాన కార్యదర్శి సాజిద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.సదస్సులో పలు కీలక తీర్మానాలు చేశారు.
2010 మే 3 నాటి జీవో ఎంఎస్ నం. 125 పరిగణనలోకి తీసుకుని, అందులో పేరొన్న దూదేకుల ఆర్థిక సహకార సంస్థ (దూదేకుల ఫైనాన్షియల్ కార్పొరేషన్)ను పూర్తిస్థాయిలో వీలైనంత త్వరగా అమలు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. అలాగే రాబోయే రోజుల్లో గవర్నర్ కోటా కింద భర్తీ చేయనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానాన్ని దూదేకుల సామాజికవర్గానికి కేటాయించి రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమాజంలో వెనుకబడిన దూదేకుల వర్గాల హకులు, సంక్షేమం కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

