న్యూఢిల్లీ : భారత వుమెన్స్ హాకీ ప్లేయర్ కొవిడ్-19కు పాజిటివ్‌గా పరీక్షలు చేసింది. దీంతో ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణ కొరియాతో జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. రోజువారీగా కొవిడ్ పరీక్షల్లో భాగంగా టీమ్ సభ్యులందరికీ పరీక్షలు చేయగా.. ఓ క్రీడాకారిణికి పాజిటివ్‌గా వచ్చిందని ఆసియా హాకీ ఫెడరేషన్ తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతున్నందుకు చింతిస్తున్నామని పేర్కొంది. ఇవాళ మధ్యాహ్నం జరుగాల్సిన దక్షిణ కొరియా- భారత్ మ్యాచ్ నిర్వహించడం లేదని, త్వరలోనే సమాచారం అందించనున్నట్లు హాకీ ఫెడరేషన్ పేర్కొంది.