Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
చిగురుమామిడి, అక్టోబర్ 10: మండలంలోని అన్ని గ్రామాల్లో 'ఎంగిలిపూల బతుకమ్మ' వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
చిగురుమామిడి, అక్టోబర్ 10: మండలంలోని అన్ని గ్రామాల్లో ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శనివారం తెల్లవారుజాము నుంచే మహిళలు, యువతులు ఉత్సాహంగా బతుకమ్మలను పేర్చి, సమీపంలోని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తంగేడు పూలు, గునుగు పూలు, పట్టుకుచ్చులు, వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను సిద్ధం చేసుకుని సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు.
బతుకమ్మ వేడుకలతో మండలంలోని అన్ని గ్రామాలు సందడిగా మారాయి. మహిళలు పెద్ద సంఖ్యలో తమ గ్రామంలోని ప్రధాన కూడళ్లలో, ఆలయాల వద్ద, చెరువు గట్లపై ఒక్కచోట చేరి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ తీరొక్క పాటలు పాడారు. చిన్నారులు, యువతులు, మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొనడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
బతుకమ్మ పాటలతో ఊరూవాడా మార్మోగాయి. ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలను ఉపయోగించి బతుకమ్మలను సింగారించి, వాటిని పూజించడం ద్వారా తెలంగాణ ఆడబిడ్డలు ప్రకృతితో తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. అనంతరం మహిళలు బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి సమీపంలోని ఆలయాల వద్ద నిమజ్జనం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

