Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Yogi Adityanath | దమ్ముంటే ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య నుంచి పోటీ చేయాలన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత (SP chief) అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) సవాల్‌ను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) స్వీకరించారు. అఖిలేశ్ యాదవ్ కూడా అయోధ్య నుంచి బరిలోకి దిగి తనపై గెలువాలని ప్రతి సవాల్ విసిరారు.
Yogi Adityanath : దమ్ముంటే ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య నుంచి పోటీ చేయాలన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత (SP chief) అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) సవాల్‌ను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) స్వీకరించారు. అఖిలేశ్ యాదవ్ కూడా అయోధ్య నుంచి బరిలోకి దిగి తనపై గెలువాలని ప్రతి సవాల్ విసిరారు. ఇద్దరి మధ్య నేరుగా పోటీ జరగాలని కండిషన్ పెట్టారు. అందుకు అఖిలేష్ రెడీ అయితే తానూ రెడీ అని చెప్పారు.
శనివారం బలరాంపూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి కుటుంబం గురించి తప్ప మరో ఆలోచన లేదని ఎద్దేవాచేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపిందని చెప్పారు. వారిలో అఖిలేశ్ బాబాయి రామ్ గోపాల్ యాదవ్ ఒకరని, మరో సీటును పారిశ్రామికవేత్త ధన్‌రాజ్ పరిమల్ నత్వానీకి కేటాయించారని విమర్శించారు.
వెనుకబడిన వర్గాలు, దళితులు, బ్రాహ్మణులు సహా ఇతర వర్గాలకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ చెప్పే ‘పీడీఏ’ కు కుటుంబ అభివృద్ధి సంస్థ, రాష్ట్రాన్ని ముంచే కూటమి అని కొత్త అర్థాలు చెబుతూ యోగి విమర్శలు గుప్పించారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీ పాలనలో యువతకు ఉద్యోగాలు రాలేదని, రైతులు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. అయోధ్యలో గతంలో రోజుకు మూడు, నాలుగు గంటలే విద్యుత్ సరఫరా ఉండేదని, పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉండేవని యోగి అన్నారు.
ఇప్పుడు నగరం రామరాజ్యానికి ఉదాహరణగా నిలుస్తోందని యోగీ చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం సీట్లు ఎన్డీయే గెలుస్తుందని యోగి ధీమా వ్యక్తంచేశారు. మిగిలిన సీట్లు ఇతర పార్టీలకు వెళ్లినా బలరాంపూర్ అభివృద్ధి ఆగదని చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై జరుగుతున్న నిరసనలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు హద్దులు దాటి వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

