రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్ మృతి | బీజేపీ నేతలతో నిందితుడికి లింక్ : కాంగ్రెస్
ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హాల్ ప్రైవేట్ రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తూ ఐదు రోజుల నుంచి కనిపించకుండా పోయిన యువతి(19) విగత జీవిగా పడిఉండటం కలకలం రేపింది.
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హాల్ ప్రైవేట్ రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తూ ఐదు రోజుల నుంచి కనిపించకుండా పోయిన యువతి(19) విగత జీవిగా పడిఉండటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి రిసార్ట్ యజమాని, మేనేజర్ సహా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరికి బీజేపీ నేతలతో సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపించడంతో ఈ వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది.
సెప్టెంబర్ 18 నుంచి తమ కూతురు కనిపించకుండా పోవడంతో యువతి తల్లితండ్రుల ఫిర్యాదు ఆధారంగా 21న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యువతి అదృశ్యమైనప్పటి నుంచి రిసార్ట్ యజమాని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. మూడు రోజుల అనంతరం రిసార్ట్ యజమాని పులకిత్ ఆర్య, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తా, మేనేజర్ సౌరవ్ భాస్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
యువతి మృతదేహం గురువారం సెప్టెంబర్ 22న లభ్యమైందని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ప్రతినిధి గరిమ దాసోని చెప్పారు. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన వినోద్ ఆర్యకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ కేసులో కేవలం 24 గంటల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. కేసులో తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- resort
- Uttarakhand
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

