న్యూయార్క్ : అమెరికాలోని లాస్‌వెగాస్ ఎయిర్‌పోర్ట్‌లో అనుచితంగా వ్యవహరిస్తూ అరెస్టయిన మహిళ తన అరెస్ట్‌కు కారణమేంటో చెప్పడంతో అంతా షాక్ తిన్నారు. తాను చూడటానికి చాలా అందంగా ఉండటంతో పోలీసులు అరెస్ట్ చేశారని ఆమె చెప్పుకొచ్చింది. నెవడా స్టేట్ లాస్ వెగాస్ హ్యారీ రీడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆగస్ట్ 31న హెంద్ బుసామి (28) ఎయిర్పోర్ట్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది.
చిలీ రెస్టారెంట్లో బిల్లు చెల్లించకుండా హంగామా చేసింది. రెస్టారెంట్ ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకోగా పరారైంది. ఆపై బ్యాగేజ్ క్లెయిమ్ ఏరియాలో ఆమె పోలీస్ అధికారుల కంటపడింది. తనలాంటి అందగత్తెను పోలీసులు ఇంతవరకూ చూడకపోవడంతో వారు తనను వేధిస్తున్నారని వాపోయింది.
పోలీసులు ఆమెను అరెస్ట్ చేయగానే వారిని దుర్భాషలాడింది. వారంతా తనపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రచ్చ చేసింది. ఇక బుసామిపై లాస్‌వెగాస్ మున్సిపల్ కోర్టు ఇప్పటికే వారెంట్ జారీ చేసిందని పోలీసులు ఆ తర్వాత గ్రహించారు.