Glenn McGrath | సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు నుంచి బుమ్రా లేకుంటే ఈ సిరీస్ ఏకపక్షమయ్యేదని ఆసీస్ మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ అన్నాడు. సిడ్నీలో జరిగిన ఓ కార్యక్రమంలో మెక్‌గ్రాత్ మాట్లాడుతూ.. ‘భారత జట్టులో అతడు చాలా కీలకమైన ఆటగాడు. ఒకవేళ అతడే లేకుంటే ఈ సిరీస్ ఏకపక్షమయ్యేది. ఇక్కడ పరిస్థితులను బుమ్రా తొందరగా ఆకలింపు చేసుకున్నాడు. వికెట్‌కు రెండు వైపులా నియంత్రణ కొనసాగిస్తూ వికెట్లు రాబడుతున్నాడు’ అని ప్రశంసలు కురిపించాడు.