Inter Exams | తుంగతుర్తి: ఈ నెల 5 నుంచి జరిగే ఇంటర్మీడియేట్ పరీక్ష కేంద్రాలకు15 నిమిషాల ముందు ఉండాలన్న ప్రభుత్య నిబంధనను తక్షణమే ఉపసంహారించుకోవాలి బీఆర్ఎస్ నాయకులు మట్టిపల్లి వెంకట్ యాదవ్ ప్రభుతాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం మండల కేంద్రంలోని విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నిబంధనతో లక్షలాది మంది విద్యార్దులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్దులకు సకాలంలో బస్సులు అందుబాటులో ఉండటం లేవని అన్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంత విద్యార్థులకు ట్రాపిక్ సమస్యల వల్ల సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేక పొవచ్చునని పేర్కొన్నారు.15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసి వేయడం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని ఇలాంటి నిబంధనలతో విద్యార్థులు పరీక్షలకు దూరం అయ్యే ప్రమాదం ఉందని మట్టిపల్లి వెంకట్ యాదవ్ అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనను తక్షణమే ఉపసంహరించుకొని పాత పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మధు, జావేద్, మని, తేజ, సతీశ్ తదితరులు పాల్గొన్నారు